‘బ్రో’ మూవీ క్రెడిట్ ఎవరిది? పవన్‌దా లేదంటే సాయి ధరమ్‌దా?

‘బ్రో’ మూవీ క్రెడిట్ ఎవరిది? పవన్‌దా లేదంటే సాయి ధరమ్‌దా?

‘బ్రో’ మూవీ గత శుక్రవారం విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. త్రివిక్రమ్ అందించిన మాటలు సినిమాకు బాగానే ప్లస్ అయ్యాయి. ఇక సినిమా కాన్సెప్ట్‌కు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడుతున్నాయి.

మనమే ఇంటికి సర్వస్వం. మనం చనిపోతే ఇల్లంతా కొలాప్స్ అవుతుంది అన్న భావనలో మనం ఉంటాం. అయితే మనం ఉన్నా లేకున్నా జరగాల్సినవి యథాతథంగా జరుగుతూనే ఉంటాయన్న కాన్సెప్ట్‌ను జనాల్లోకి తీసుకెళ్లడంలో సముద్రఖని అయితే సక్సెస్ అయ్యారు. ఇక ఈ సినిమా మల్టీ స్టారర్ మూవీగా తెరెక్కిన విషయం తెలిసిందే. పవన్, సాయి ధరమ్ ఇద్దరూ సినిమాకు కీలకమే.

Bro Telugu Movie

మరి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ప్రస్తుతం ఇదే పెద్ద సమస్యగా మారింది. సినిమా విడుదలకు ముందు దీనికి సర్వస్వం పవనే అన్నట్టుగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సినిమా విడుదలైన తర్వాత గానీ అసలు విషయం తెలియలేదు.

పవన్, సాయి ధరమ్ క్యారెక్టర్లు ఒకదానిపై ఒకటి ఆధారపడినవి కావడం గమనార్హం. ఒక క్యారెక్టర్ లేకుంటే మరో క్యారెక్టర్‌కు విలువ లేదు. పైగా ఇద్దరూ నటన విషయంలో ఇరగదీశారు. దీంతో సినిమా చూశాక పవన్ ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. మొత్తానికి క్రెడిట్ ఇద్దరికీ సమానంగా దక్కుతోంది.

ఇవీ చదవండి:

ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ హీరోయిన్ ట్వీట్.. దీనిపై రచ్చ రచ్చ..

జగన్, అంబటి రాంబాబులకు ‘బ్రో’లో దిమ్మతిరిగే డైలాగ్స్.. వైరల్ చేస్తున్న ఫ్యాన్స్

గుంటూరు కారం సినిమా నిర్మాతలకు చుక్కలేనట..

BRO Twitter Review: ‘బ్రో’ ట్విటర్ రివ్యూ: ఆ సన్నివేశాలు హైలైట్

బాలి ద్వీపంలో తెగ ఎంజాయ్ చేస్తున్న సమంత

సినీ నటి శోభన ఇంట్లో దొంగతనం..

Google News