‘బ్రో’ను ఓ రేంజ్‌కు వెళ్లకుండా ఆపిన అంశాలివే.. లేదంటేనా?

Bro Range

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘వినోదాయ సిత్తం’ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలున్నాయి. కానీ విడుదలైన తర్వాత మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. దీనికి ఒక కారణం కాదు.. చాలానే ఉన్నాయి.

నిజానికి సినిమా కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది. దీనిని తెరకెక్కించడంలో దర్శకుడు సముద్రఖని సైతం సక్సెస్ అయ్యారు. కానీ కొన్ని అంశాలను మరీ ఓవర్‌గా చూపించారు. వీటిలో ఒకటి పవన్ సాంగ్స్. గతంలో పవన్ నటించిన సినిమాల నుంచి హిట్ సాంగ్స్ దాదాపు అన్నింటినీ ఈ చిత్రంలో యాడ్ చేశారు. కొంతవరకూ ఓకే కానీ కనీసం సమయం సందర్భం లేకుండా ఈ పాటలను యాడ్ చేయడమే చాలా పెద్ద మైనస్.

Bro Nizam Rights

ఇక మంత్రి అంబటిని ఇమిటేట్ చేయడం.. దీనిపై వైసీపీ వాళ్లంతా రివర్స్ అవడం జరిగింది. నిజానికి వైసీపీలోని యూత్‌లో కూడా పవన్ ఫ్యాన్స్ ఉన్నారు. వారంతా ఈ సినిమాకి దూరం. ఇక పవన్ చిటికెలు వేయడం ఎక్కువైపోయిందనేది విమర్శకుల మాట. త్రివిక్రమ్ డైలాగ్స్ కూడా సినిమాను అనుకున్న స్థాయికి తీసుకెళ్లకుండా అడ్డుపడ్డాయన్నది విమర్శకుల మాట.

మొత్తానికి ఒక రేంజ్‌లో ఉండాల్సిన సినిమాను ఈ మైనస్‌లన్నీ ఓ స్థాయిలోనే నిలిపివేశాయి. ఈ మైనస్‌లను సరి చేసుకుంటేనా.. సినిమా ఎక్కడో ఉండేది.

ఇవీ చదవండి:

‘బ్రో’ మూవీ క్రెడిట్ ఎవరిది? పవన్‌దా లేదంటే సాయి ధరమ్‌దా?

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు విజయం ఎలా సాధ్యమైందంటే..

75 ఏళ్ల వృద్ధుడికి వలవేసిన సీరియల్ నటి.. బట్టలన్నీ విప్పించి.. ఫోటోలు తీయించి.. ఆపై..

సినీ నటి శోభన ఇంట్లో దొంగతనం..

చాలా కాలం తర్వాత బుల్లితెరపై దర్శనమిచ్చిన చలాకీ చంటి.. ఎలా ఉన్నాడంటే..

Google News