ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకోబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్..

ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకోబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్..

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, నటుడు రాహుల్‌ మహాజన్‌ చాలా మందికి తెలిసే ఉంటాడు. ఆయన ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకోబోతున్నాడు. ఇప్పటికే ఇద్దరు మహిళలను పెళ్లాడి వారి నుంచి విడాకులు తీసుకున్నాడు. అనంతరం ఖజకిస్తాన్‌ మోడల్‌, నటల్య ఇలినాను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెతో కూడా విడిపోయేందుకు సిద్ధమయ్యాడు. గతేడాదే రాహుల్ విడాకులకు దరఖాస్తు చేశాడు.

కానీ విషయం లేటుగా బయటకు వచ్చింది. అయితే వీరిద్దరి మధ్య పెళ్లయినప్పటి నుంచే మనస్పర్థలున్నాయని తెలుస్తోంది. కలిసి ఉండేదుకు ఇద్దరూ చాలా ప్రయత్నించారట. కానీ కుదరదని తెలుసుకుని కలహాల కాపురానికి స్వస్తి చెప్పాలని డిసైడ్ అయ్యారట. కాగా.. 2006లో శ్వేతా సింగ్ అనే మహిళను రాహుల్ వివాహమాడాడు. కేవలం రెండేళ్లు కలిసుండి వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు.

Bigg Boss Rahul Mahajan 3rd divorce

ఆ తర్వాత రాహుల్‌ దుల్హానియా లేజాయేగా అనే రియాలిటీ షోలో డింపీ గంగూలీని కలిశాడు. ఈ షోలో వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 2010లో పెళ్లి చేసుకున్నారు. 2015లో ఇద్దరూ విడిపోయారు. ఇక నటాషాను 2019లో రాహుల్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈమెకు కూడా గుడ్ బై చెప్పాడు. అయితే ఈ సారి రాహుల్ చాలా మనో వేదనకు గురయ్యాడట. విడాకులపై ప్రశ్నించగా.. తానిప్పుడు ఏదీ మాట్లాడే పరిస్థితిలో లేనని చెప్పుకొచ్చాడట.

ఇవీ చదవండి:

‘బ్రో’ మూవీ క్రెడిట్ ఎవరిది? పవన్‌దా లేదంటే సాయి ధరమ్‌దా?

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు విజయం ఎలా సాధ్యమైందంటే..

75 ఏళ్ల వృద్ధుడికి వలవేసిన సీరియల్ నటి.. బట్టలన్నీ విప్పించి.. ఫోటోలు తీయించి.. ఆపై..

సినీ నటి శోభన ఇంట్లో దొంగతనం..

చాలా కాలం తర్వాత బుల్లితెరపై దర్శనమిచ్చిన చలాకీ చంటి.. ఎలా ఉన్నాడంటే..

Google News