ఆసుపత్రి పాలైన ఆదాశర్మ

ఆసుపత్రి పాలైన ఆదాశర్మ

ఆదా శర్మ.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. నితిన్ సరసన హార్ట్ అటాక్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కానీ ఆ తరువాత ఎందుకోగానీ ఫేడవుట్ అయిపోయింది. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో నటించినప్పటికీ పెద్దగా కెరీర్‌కు అయితే ఉపయోగపడలేదు. తాజాగా నటించిన ‘ది కేరళ స్టోరీస్’ మాత్రం ఆదా శర్మ కెరీర్‌కు మాంచి హైప్ ఇచ్చింది.  

ఇన్నేళ్ల తర్వాత ఆదాశర్మకు ‘ది కేరళ స్టోరీ’ రూపంలో అదృష్టం తలుపు పట్టింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు ఆదా శర్మ తలుపు తడుతున్నాయి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆసుపత్రి పాలైంది.

బుధవారం ఆదా అస్వస్థతకు గురవ‌డంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. త‌న అప్‌ క‌మింగ్ షో ‘క‌మాండో’ ప్రమోష‌న్ ఈవెంట్‌లో పాల్గొనడానికి ముందు ఆమె అనారోగ్యానికి లోన‌య్యారు.

ఆసుపత్రి పాలైన ఆదాశర్మ

తీవ్ర డ‌యేరియాతో పాటు ఫుడ్ అల‌ర్జీతో ఆదా బాధపడుతోందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆదా శ‌ర్మ వైద్యుల ప‌ర్యవేక్షణలో ఉందని.. ఆమె ఆరోగ్య ప‌రిస్ధితి నిల‌క‌డ‌గా ఉంద‌ని స‌మాచారం.

ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొనే ముందు ఆమె వాంతుల‌తో బాధ‌ప‌డటంతో ఆస్పత్రిలో చేర్పించారు. ‘క‌మాండో’ సిరీస్‌లో భావ‌నా రెడ్డి పాత్ర పోషించిన ఆదా శ‌ర్మ ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమోష‌న్స్‌లో బిజీ బిజీగా గడిపేస్తోంది.

ఇవీ చదవండి:

‘బ్రో’ని తొక్కేస్తున్న బేబి.. ఇంకా ఆగని కలెక్షన్ల సునామీ

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఇటలీలో ఎందుకు? ఏ సంప్రదాయంలో వివాహం జరగబోతోందో తెలుసా?

నటుడు నరేష్ -మాజీ భార్య రమ్య రఘుపతి కేసులో బెంగళూరు కోర్టు కీలక ఉత్తర్వులు

నిహారికతో పెళ్లి వార్తలపై తరుణ్ ఏం చెప్పాడంటే..

తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక యంగ్ హీరో మృతి.. వెల్లువెత్తుతున్న నివాళులు

ఎదపై టాటూ.. చేతిలో మందు గ్లాస్‌తో రచ్చ రచ్చ చేస్తున్న అనసూయ