తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక యంగ్ హీరో మృతి.. వెల్లువెత్తుతున్న నివాళులు

Young Hero Angus Cloud passed away

ఈ యంగ్ హీరోకి అభిమాన గణం చాలా ఎక్కువ. కానీ అందరి హృదయాలను విషాదంలో ముంచేసి తను తుది శ్వాస విడిచాడు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఎవరా యంగ్ హీరో? ఎలా మరణించాడు? అతని పేరు అంగస్ క్లౌడ్. మనకు తెలియకపోవచ్చేమో కానీ హాలీవుడ్‌లో మాత్రం చాలా ఫేమస్. 25 ఏళ్లు కూడా లేని ఈ యంగ్ హీరో పెద్ద ఎత్తున అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. 

2019లో హెచ్.బి.ఓ హిట్ సిరీస్ యుఫోరియాతో తన నటన జీవితాన్ని అంగస్ క్లౌడ్ ప్రారంభించాడు. అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో నటిస్తూ బాగా ఫేమస్ అయిపోయాడు. అయితే సరిగ్గా వారం క్రితం అంగస్ తండ్రి చనిపోయారు. తాజాగా ఓక్లాన్‌లోని తన నివాసంలో అంగస్ కూడా మరణించాడు. ఈ విషయాన్ని అంగస్ మేనేజర్ కైట్ బెయిలీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Angus cloud passed away

ఒక అద్భుతమైన వ్యక్తికి బరువైన హృదయంతో వీడ్కోలు చెప్పాల్సి వచ్చిందని.. ఆయన కేవలం ఒక కళాకారుడే కాదు. అభిమానుల మనసుకు అతను ఒక స్నేహితుడిగా ,సోదరుడిగా, కొడుకుగా చేరువైన వ్యక్తి అంగస్ అని కైట్ బెయిలీ తెలిపారు. గత వారం అంగస్ తండ్రి చనిపోయారు. దీంతో అంగస్ తీవ్ర మనోవేదనకు గురి అయ్యాడు. అంగస్ కోల్పోయింది అతని తండ్రినే కాదు ఒక గొప్ప స్నేహితుడిని కూడా అని కైట్ తెలిపారు.

Google News