నటుడు నరేష్ -మాజీ భార్య రమ్య రఘుపతి కేసులో బెంగళూరు కోర్టు కీలక ఉత్తర్వులు

నటుడు నరేష్ -మాజీ భార్య రమ్య రఘుపతి కేసులో బెంగళూరు కోర్టు కీలక ఉత్తర్వులు

సీరియస్ నటుడు నరేష్ -మాజీ భార్య రమ్య రఘుపతి కేసులో బెంగళూరు కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ పెళ్లి మూవీని నిలిపేయాలని రమ్య రఘుపతి కోరారు. ఆమె వేసిన పిటీషన్‌లో మెరిట్స్ లేని కారణంగా పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సినిమా పూర్తిగా కల్పితమని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఆధారంగా విచారించిన న్యాయస్థానం పిటిషన్‌ను డిస్ మిస్ చేసింది.

ఇక మరో కేసులో నరేష్‌కు ఊరట లభించింది. నరేష్ అతని కుటుంబ సభ్యులు, పవిత్ర లోకేష్ పై న్యాయస్థానంలో రమ్య రఘుపతి కేసు వేశారు. గృహ హింస చట్టం కింద నరేష్, అతని కుటుంబం సభ్యులపై చర్యలు తీసుకోవాలని రమ్య కోరారు. పిటిషన్‌ను విచారించి న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. నరేష్ ఇంట్లోకి రమ్య రఘుపతి రాకుండా నిషేధం విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.

నరేష్, అతని కుటుంబ సభ్యులు అందించిన సాక్ష్యాలను పరిశీలించి న్యాయస్థానం తీర్పును వెలువరించింది. నరేష్ ప్రాపర్టీని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి రావడంతో నరేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నరేష్ ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్‌కు, నరేష్‌కు అసౌకర్యం కల్పించవద్దంటూ రమ్య రఘుపతికి చురకలు వేసింది. నరేష్ రమ్య రఘుపతి ఆరు సంవత్సరాలుగా కలిసి జీవించడం లేదని కోర్టు నిర్ధారణకు వచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో నరేష్ రమ్యల విడాకులకు మార్గం సుగమం అయ్యింది.

ఇవీ చదవండి:

‘బ్రో’ను ఓ రేంజ్‌కు వెళ్లకుండా ఆపిన అంశాలివే.. లేదంటేనా?

సుమన్‌పై ఆరోపణలు, అరెస్ట్ వెనుక ఆ ముగ్గురు..!

యాంకర్ ప్రదీప్ నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

ఎదపై టాటూ.. చేతిలో మందు గ్లాస్‌తో రచ్చ రచ్చ చేస్తున్న అనసూయ

Google News