మహేష్‌ పుట్టినరోజుకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్న రాజమౌళి

మహేష్‌ పుట్టినరోజుకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్న రాజమౌళి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ క్రేజ్ ఉంది. దాదాపు 50 ఏళ్లకు చేరువలో ఉన్న మహేష్.. కుర్ర హీరోలకు పోటీనిస్తున్నాడు. అటు యాడ్స్.. ఇటు బిజినెస్.. మరోవైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. మహేష్ నెక్ట్స్ సినిమా దర్శకధీరుడు రాజమౌళితో ఉంటుందన్న టాక్ నడిచినప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటి వరకు రాజమౌళి నుంచి ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఒక ఆసక్తిక న్యూస్ బయటకు వచ్చింది. జక్కన్న మహేష్ పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారట. ఆ గిఫ్ట్ మరేదో కాదు.. మహేష్‌తో సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేస్తారట. ఇప్పటికే దానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రెడీ చేయించినట్టు సమాచారం. పురాణ పురుషుడిగా తన సినిమాలో మహేష్‌ను రాజమౌళి చూపించనున్నారట.

Advertisement

అయితే పౌరాణిక పాత్రలో మహేష్ ఎలా ఉంటారో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి స్క్రిప్ట్ కూడా రెడీ చేశారని సమాచారం. మహేష్‌ను మునుపెన్నడూ చూడని విధంగా రాజమౌళి చూపిస్తారట. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందనుందట. విజయేంద్రప్రసాద్ రచించిన స్క్రిప్టు ప్రకారం హనుమంతుని పురాణం నుంచి కాన్సెప్ట్ తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి మహేష్ పుట్టినరోజున జక్కన్న అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారట.

ఇవీ చదవండి:

ఆసుపత్రి పాలైన ఆదాశర్మ

‘బ్రో’ని తొక్కేస్తున్న బేబి.. ఇంకా ఆగని కలెక్షన్ల సునామీ

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఇటలీలో ఎందుకు? ఏ సంప్రదాయంలో వివాహం జరగబోతోందో తెలుసా?

నటుడు నరేష్ -మాజీ భార్య రమ్య రఘుపతి కేసులో బెంగళూరు కోర్టు కీలక ఉత్తర్వులు

నిహారికతో పెళ్లి వార్తలపై తరుణ్ ఏం చెప్పాడంటే..