‘బేబీ’ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. ఓటీటీలో నాలుగు గంటల సినిమా..

‘బేబీ’ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. ఓటీటీలో నాలుగు గంటల సినిమా..

చిన్న సినిమాగా విడుదలైన ‘బేబి’ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. కలెక్షన్స్‌ పరంగా కూడా పలు రికార్డులను కూడా క్రియేట్‌ చేసింది. అసలు ఈ సినిమా ఈ స్థాయిలో కాసుల వర్షం కురిపిస్తుందని ఎవరూ ఊహించలేదు. సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్‌ను గడగడలాడించింది.

నిజానికి ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఒక టాలీవుడ్ సంచలనం. అలాంటి సినిమాను సైతం బ్రేక్ చేసి మరీ పరుగులు తీసింది. చివరకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘బ్రో’ సినిమాను తీసేసి మరీ కొన్ని థియేటర్లలో బేబి మూవీని ఆడిస్తున్నారంటే ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందనేది అర్ధమవుతోంది. ఇక త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. అయితే దీనిపై ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ వర్గాల్లో సర్క్యులేట్ అవుతోంది.

Baby First Day Collections

కొన్ని మార్పులు చేర్పులతో ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోందట. ముందుగా ఈ సినిమా థియేటర్లలో సుమారు 3 గంటల నిడివితో విడుదలైంది. ఓటీటీలో మాత్రం నాలుగు గంటల నిడివితో రిలీజ్ కాబోతోందట. నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కానున్న మూవీలో ఒక సాంగ్‌తో పాటు కొన్ని సీన్లను చేర్చనున్నారని సమాచారం. అవి కూడా వైష్ణవి చైతన్య, విరాజ్ మధ్య వచ్చే బోల్డ్ సన్నివేశాలతో పాటు ఆనంద్ దేవరకొండ అతని తల్లికి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

కార్తీ ‘జపాన్’ చిత్రం షాకింగ్ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్

ఊర మాస్ గెటప్స్‌తో తలపడబోతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్

మహేష్‌ పుట్టినరోజుకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్న రాజమౌళి

ఆసుపత్రి పాలైన ఆదాశర్మ

‘బ్రో’ని తొక్కేస్తున్న బేబి.. ఇంకా ఆగని కలెక్షన్ల సునామీ

Google News