మెగాస్టార్ చిత్రంలో కీలక పాత్రలో రామ్ చరణ్ క్లాస్‌మేట్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?

మెగాస్టార్ చిత్రంలో కీలక పాత్రలో రామ్ చరణ్ క్లాస్‌మేట్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. వాల్తేరు వీరయ్య తరువాత చేస్తున్న చిత్రం కాబట్టి ఇది కూడా తప్పక హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ మరో రీమేక్‌లో నటించనున్నారని సమాచారం.

మలయాళ సూపర్ హిట్ మూవీ బ్రో డాడీ రీమేక్ లో చిరంజీవి నటిస్తున్నారట. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హీరో రామ్ చరణ్ స్కూల్ మేట్ ఈ చిత్రంలో నటిస్తున్నాడట. ఇంతకీ ఆ స్కూల్ మేట్ మరెవరో కాదు.. హీరో శర్వానంద్. ఇప్పటికే శంకర్ దాదా MBBS చిత్రంలో ఓ కీలక పాత్రలో శర్వా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

Chiranjeevi, Sharwanand, Ram Charan

ఈ న్యూస్ నిజమే అయితే చిరుతో ఇది శర్వాకి రెండో సినిమా అవుతుంది. ఇక ఈ సినిమాలో శర్వా ఏ పాత్రలో నటిస్తున్నాడో తెలుసా? చిరంజీవి కొడుకు పాత్రలోనట. ఓహో సూపర్ కదా.. చెర్రీ క్లోజ్ ఫ్రెండ్ వచ్చేసి ఈ చిత్రంలో చిరు కొడుకుగా నటించడం. తొలుత చిరు కొడుకు పాత్ర కోసం సిద్ధు జొన్నలగడ్డను అనుకున్నారట. అయితే అనుకోని కారణాలతో సిద్దు డ్రాప్ అవడంతో శర్వాకు అవకాశం దక్కిందని టాక్. ఇక బ్రో డాడీ ఒరిజినల్ మూవీలో మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు.

ఇవీ చదవండి:

కార్తీ ‘జపాన్’ చిత్రం షాకింగ్ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్

‘బేబీ’ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. ఓటీటీలో నాలుగు గంటల సినిమా..

ఊర మాస్ గెటప్స్‌తో తలపడబోతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్

మహేష్‌ పుట్టినరోజుకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్న రాజమౌళి

ఆసుపత్రి పాలైన ఆదాశర్మ

Google News