ఎప్పుడూ ఇదే పనా..? బోర్ కొట్టదా..? ఆహ్లాదకరంగా ‘ఆకాశం దాటి వ‌స్తావా’ టీజర్

ఎప్పుడూ ఇదే పనా..? బోర్ కొట్టదా..? ఆహ్లాదకరంగా 'ఆకాశం దాటి వ‌స్తావా' టీజర్

కొరియోగ్రాఫ‌ర్ య‌ష్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న ‘ఆకాశం దాటి వ‌స్తావా‘ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ నుంచి ప్రొడ‌క్ష‌న్ నెం.2గా రూపొందుతోంది. కార్తీక ముర‌ళీధ‌ర‌న్ హీరోయిన్. శశి కుమార్ ముతులూరి ద‌ర్శ‌కత్వంలో హ‌ర్షిత్‌, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు.

72 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడబోతోన్నట్టుగా అనిపించింది. ఓయ్ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్.. ఎప్పుడూ ఇదే పనా? బోర్ కొట్టదా? అంటూ హీరోయిన్ మాట్లాడే మాటలు.. ఎప్పుడూ ఇంతే అందంగా ఉంటావ్.. నీకు బోర్ కొట్టదా? అంటూ హీరో చెప్పే సమాధానంతో టీజర్ మొదలవుతుంది. ‘ఎన్ని సార్లు వస్తావ్ ఇలా?’ అని హీరోయిన్ అనడం.. ‘ఎన్ని సార్లైనా వస్తాను’ అని హీరో అనడం.. ‘ఎంత దూరమైనా వస్తావా?’ అని హీరోయిన్.. ‘అడిగి చూడు’ అని హీరో.. ‘అబ్బో అడినంత మాత్రానా సముద్రాలు దాటి ఆకాశం దాటి వస్తావా?’ అంటూ హీరోయిన్ సంభాషణలతో టీజర్ సాగింది.

ఎప్పుడూ ఇదే పనా..? బోర్ కొట్టదా..? ఆహ్లాదకరంగా 'ఆకాశం దాటి వ‌స్తావా' టీజర్

ఈ టీజర్ ద్వారా సరికొత్త ప్రేమ కథను చూపించబోతోన్నట్టుగా దర్శక నిర్మాతలు చెప్పకనే చెప్పేశారు. ఈ టీజర్‌లో ర్యాంపీ నందిగాం అందించిన విజువల్స్, సింగర్ కార్తీక్ ఇచ్చిన మ్యూజిక్, యశ్ కార్తీక ముర‌ళీధ‌ర‌న్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. మొత్తానికి టీజర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు.

బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వస్తోన్న రెండో చిత్రమిది. కొత్త టీంతో ఈ సారి మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. హీరో యశ్, హీరోయిన్ కార్తీక ముర‌ళీధ‌ర‌న్‌లు కొత్త వారే. ఈ సినిమాతో సింగర్ కార్తిక్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

ఇవీ చదవండి:

మెగాస్టార్ చిత్రంలో కీలక పాత్రలో రామ్ చరణ్ క్లాస్‌మేట్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?

‘బేబీ’ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. ఓటీటీలో నాలుగు గంటల సినిమా..

కార్తీ ‘జపాన్’ చిత్రం షాకింగ్ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్

ఊర మాస్ గెటప్స్‌తో తలపడబోతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్

మహేష్‌ పుట్టినరోజుకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్న రాజమౌళి

Google News