తనకు పుట్టిన బిడ్డకు గుండెలో రెండు రంధ్రాలున్నాయని తెలిసి తల్లడిల్లిపోయిన స్టార్ హీరోయిన్..

తనకు పుట్టిన బిడ్డకు గుండెలో రెండు రంధ్రాలున్నాయని తెలిసి తల్లడిల్లిపోయిన స్టార్ హీరోయిన్..

తనకు పుట్టిన బిడ్డకు గుండెలో రెండు రంధ్రాలున్నాయని తెలిస్తే ఏ తల్లైనా ఎంతలా తల్లడిల్లుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తల్లి సామాన్యురాలైనా.. లేదంటే ఓ పెద్ద సెలబ్రిటీ అయినా సరే. ఇటీవలి కాలంలో ఇదే పరిస్థితి బాలీవుడ్ ప్రముఖ నటి బిపాసా బసుకి సైతం ఎదురైందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిపాసా తను తల్లయ్యాక పడిన ఆవేదనను వెల్లడించారు. 

బిపాసా బసు ఆమె భర్త కరణ్ తమకు కూతురు పుట్టడంతో ఎంతో ఆనందంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆ తరువాత తమ యువరాణి ప్రయాణించడం కోసం అత్యంత ఖరీదైన కారు కొనుగోలు చేశారట. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు ఉండలేదట. బిడ్డ పుట్టిన మూడో రోజే చిన్నారికి గుండెలో రెండు రంధ్రాలున్నాయని తేలిందట. తాజాగా కూతురికి వచ్చిన ఒక కష్టాన్ని చూసి ఆ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement
Bipasha Basu daughter

బిపాసా బసు కూతురి గుండెలో రెండు రంధ్రాలు ఉన్నాయని వైద్యులు తేల్చేశారట. ఈ విషయాన్ని నేహా ధూపియాతో జరిగిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. మూడు నెలల వయసులో తమ చిన్నారికి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చిందట. చిన్నారికి నయం అవుతుందో లేదో తెలుసుకోవడానికి ప్రతి నెల గుండెకు స్కాన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. కానీ మూడు నెలల వయసులో శస్ర్త చికిత్స చాలా కష్టమని.. కానీ చివరి వరకు సర్జరీ కోసం వెయిట్ చేసి అంగీకరించామని బిపాసా చెప్పుకొచ్చింది.

ఇవీ చదవండి:

క‌ళ్యాణ్ రామ్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’ రిలీజ్ డేట్

ఎప్పుడూ ఇదే పనా..? బోర్ కొట్టదా..? ఆహ్లాదకరంగా ‘ఆకాశం దాటి వ‌స్తావా’ టీజర్

మెగాస్టార్ చిత్రంలో కీలక పాత్రలో రామ్ చరణ్ క్లాస్‌మేట్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?

‘బేబీ’ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. ఓటీటీలో నాలుగు గంటల సినిమా..

ఊర మాస్ గెటప్స్‌తో తలపడబోతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్