ఓరినాయనో.. బిగ్‌బాస్ హౌస్‌ లోకి వెళ్తున్నది వీళ్ళే.. ఇక రచ్చ రచ్చే..

Bigg Boss 7 Telugu Contestants List

 మరి కొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోలు సందడి చేస్తున్నాయి. ఈసారి కూడా ఈ షోకి నాగార్జునే హోస్ట్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇకపోతే.. సీజన్ 6 పెద్దగా క్లిక్ అవలేదు. దీనికి మెయిన్ కారణమైతే కంటెస్టెంట్‌లే. పెద్దగా తెలియని వాళ్లను తీసుకొచ్చి కంటెస్టెంట్‌లను చేయడం.. వారు కూడా కంటెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అవడంతో సీజన్ 6 ఫ్లాప్ అయ్యింది.

ఈ సారి మాత్రం ఇలాంటిదేమీ జరగకుండా బిగ్‌బాస్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకుల అంచనాలకు మించి ఎంటర్‌టైన్ చేసి భారీ టీఆర్పీ రాబట్టాలనే యోచనలో ఉన్నారు. ఈ సారి హౌస్‌లోకి వెళ్లే వారి లిస్ట్ ఇప్పటికే రెడీ అయిపోయింది.

ఓరినాయనో.. బిగ్‌బాస్ హౌస్‌ లోకి వెళ్తున్నది వీళ్ళే.. ఇక రచ్చ రచ్చే..

ఇప్పటికే కొందరి పేర్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక హౌస్‌లో అమ్మాయిల సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే గొడవలు అంత తీవ్రంగా ఉంటాయని బిగ్‌బాస్ నిర్వాహకులు ఫీల్ అయినట్టున్నారు.

అందుకే ఈసారి గ్లామర్ డోస్‌ను పెంచేశారు. హౌస్‌లో మెజారిటీ అమ్మాయిలు ఉండేలా ప్లాన్ చేశారట. ఇక ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. బుల్లితెర నటుడు ప్రభాకర్, సింగర్ మోహన భోగరాజు, సింగర్ సాకేత్, యూట్యూబర్ శ్వేతా నాయుడు, సీరియల్ జంట అమర్ దీప్-తేజస్విని, కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి, సురేఖా వాణి, జర్నలిస్ట్ సురేష్, టిక్ టాక్ దుర్గారావు దంపతులు హౌస్‌లోకి అడుగు పెట్టనున్నారట.

ఇవీ చదవండి:

క‌ళ్యాణ్ రామ్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’ రిలీజ్ డేట్

ఎప్పుడూ ఇదే పనా..? బోర్ కొట్టదా..? ఆహ్లాదకరంగా ‘ఆకాశం దాటి వ‌స్తావా’ టీజర్

మెగాస్టార్ చిత్రంలో కీలక పాత్రలో రామ్ చరణ్ క్లాస్‌మేట్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?

‘బేబీ’ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. ఓటీటీలో నాలుగు గంటల సినిమా..

ఊర మాస్ గెటప్స్‌తో తలపడబోతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్

మహేష్‌ పుట్టినరోజుకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్న రాజమౌళి

Google News