Sai Pallavi: బాలీవుడ్‌లో రూపొందనున్న మరో రామాయణం.. సీతమ్మగా సాయిపల్లవి.. !

ఏంటో కానీ ప్రస్తుతం అంతా రామాయణంపై ఫోకస్ చేశారు. ఇప్పటికే ఓం రౌత్(Om Raut), ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబోలో రామాయణంలోని కొన్ని ఘట్టాల ఆధారంగా ‘ఆదిపురుష్’(Adipurush) రూపొందిన విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్‌లోనూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) రామాయణం(Ramayanam)ను తెరకెక్కించనున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇక తాజాగా బాలీవుడ్‌లోనే మరో రామాయణంను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. 

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణంలోని కొన్ని ఘట్టాల ఆధారంగా రామాయణం(Ramayanam) రూపొందబోతోందట. ఈ చిత్రంలో సీతమ్మ పాత్రలో సాయిపల్లవి(Sai Pallavi) నటించనుందని టాక్ నడుస్తోంది. అసలే అమ్మడు పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తుంది. ఇక సీతమ్మ పాత్ర అంటే జీవించేయడం ఖాయమని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెద్దగా మేకప్ వేసుకోకుండా నటించే సాయి పల్లవి అయితేనే సీతమ్మ క్యారెక్టర్‌కు సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట.

Advertisement

విరాటపర్వం(Viarata Parvam), గార్గీ(Gargi) మూవీస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సాయిపల్లవి(Sai Pallavi) ప్రస్తుతం శివ కార్తికేయన్‌(Siva Karthikeyan)తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇది పూర్తైతే.. అది కూడా తనకు సీతమ్మ పాత్రలో నటించేందుకు అంగీకరమైతే రామాయణం మూవీ స్టార్ట్ అవుతుందని టాక్. అయితే ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, రావణుడి పాత్రలో హృతిక్ రోషన్(Hrithik Roshan) ఎంపిక చేయనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టుకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Advertisement
Sootiga Team

Recent Posts

మారని టీడీపీ తీరు.. డీబీటీ లబ్ధిదారులతో పచ్చ ముఠా చెలగాటం!

అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తినా తిననివ్వదు అన్నట్టుగా ఉంది టీడీపీ వ్యవహారం. టీడీపీ తీరు మారేలా కనిపించడం లేదు.…

May 10, 2024

తన భార్య ఎదుర్కొన్న దారుణ అవమానాన్ని వివరించిన యాంకర్ రవి..

టాలీవుడ్ టాప్ మేల్ యాంకర్స్‌లో రవి ఒకడు. రవి చేసిన షోస్ అన్నీ మంచి సక్సెస్ సాధిస్తూ ఉంటాయి. అప్పట్లో…

May 10, 2024

‘ఛీ.. నీ బతుకు’ అంటూ నెటిజన్ కామెంట్.. కలర్స్‌ స్వాతి రియాక్షన్ ఇదీ

కలర్స్ స్వాతి.. బుల్లితెరపై తన కెరీర్‌ను ప్రారంభించి.. ఆపై వెండితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యూత్ అయితే స్వాతిని…

May 10, 2024

సూర్య, చెర్రీ మల్టీస్టారర్ నిజమేనా.. డైరెక్టర్ కూడా ఫిక్సేనా!

పాన్ ఇండియా సినిమాల్లో భాగంగా కొన్ని మల్టీ స్టారర్ సినిమాలు రూపొందుతున్నాయి. ఇలా రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన…

May 10, 2024

ఆ స్టార్ హీరో జంట విడిపోనుందా? షాక్ అవుతున్న ఇండస్ట్రీ..

ఇండస్ట్రీలో మరో స్టారో హీరో, హీరోయిన్ జంట విడాకులు తీసుకుబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీలో విడాకులేం కొత్త కాదు కానీ…

May 9, 2024

ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ఓ సామ్రాజ్యాన్నే సృష్టించబోతున్నారట..

పాన్ ఇండియాలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్‌లో ఒకరైన ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా రానున్న విషయం తెలిసిందే.…

May 9, 2024