RTV ఆఫీసుపై ఈడీ దాడులు!!

RTV ఆఫీసుపై ఈడీ దాడులు!!

RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ ఎన్నికల ముందు ఉవ్వెత్తున లేవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆఖరికి సర్వేలు కూడా చేసి నానా రచ్చ రచ్చ చేసింది. యూట్యూబ్ ఛానెల్ కాస్త మెయిన్ స్ట్రీమ్ మీడియాగా మార్చాలని ఇప్పుడిప్పుడే అనుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఆర్టీవీ ఓనర్ రవిప్రకాష్ కు ఊహించని షాక్ తగిలిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అసలేం జరిగింది..?

ఇప్పటికే రవిప్రకాష్ పై కేసులు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు RTV ఖర్చులు మొత్తం క్యాష్ రూపంలో ఖర్చు పెడుతున్నారట. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి ED చెవిన పడిందని.. అధికారులు రంగంలోకి దిగిపోయారని తెలిసింది. ఈ క్రమంలో రవి ప్రకాష్ గత సంవత్సర కాలంగా Rtv ఎలా నడుపుతున్నారు..? క్యాష్ రూపంలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు..? అనే లెక్కలు బయటకు తీస్తే ED అధికారులే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయని టాక్ నడుస్తోంది.

RTV ఆఫీసుపై ఈడీ దాడులు!!

ED ఏం తేల్చింది..?

RTV కొనుగోలు చేసిన ఎక్యూప్మెంట్ మొదలుకొని చెల్లింపులు జరిగినట్లు ED అధికారులు గుర్తించారని తెలిసింది. ఇక ఉద్యోగులకు జీతాలు సైతం క్యాష్ ఇచ్చేవారట. ఈ విషయం కూడా ED బయటికి తీసి.. రెండ్రోజులుగా మూడో కంటికి తెలియకుండా అత్యంత గోప్యంగా విచారణ చేస్తూ లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది. లెక్కలు చెప్పలేక, అధికారుల ప్రశ్నలకు రవి ప్రకాష్ మొదలుకుని మిగిలిన ప్రధాన మెంబెర్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట.

ఇందులో నిజానిజాలు ఏంటో తెలియాలి

ఈ వ్యవహారం అంతా బయటకి పొక్కడంతో మరోసారి రవిప్రకాష్ సైలెంట్ అయ్యారని సమాచారం. ఐతే ఈ సోదాలపై ఇంతవరకు ఈడీ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం, ఇంత జరుగుతున్నా RTV ఛానెల్ యాజమాన్యం కనీసం ఖండిచడమో లేకుంటే నిజమే అని చెప్పడమో చేయకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి మరి..!