చిప్ప కూడు తింటున్నా.. పవిత్ర పొగరు తగ్గలేదే..!

చిప్ప కూడు తింటున్నా.. పవిత్ర పొగరు తగ్గలేదే..!

కన్నడ హీరో దర్శన్.. ఆయన లవర్ పవిత్ర ఇద్దరూ హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ ఇద్దరిలోనూ ఎక్కడా ఇసుమంత కూడా హత్య చేశామన్న పశ్చాతాపం లేకపోవడం గమనార్హం. పైగా.. అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్లుగా పవిత్ర తెగ ఫీల్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే.. పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో లిప్‌స్టిక్‌ వేసుకొని, నవ్వుతూ నటిస్తూ వచ్చిన పవిత్ర.. అదే ఫ్లో మెయింటెయిన్ చేస్తోంది. ఆఖరికి పోలీసు కస్టడీలో కూడా మేకప్ వేసుకొని కనిపించడం చూసిన జనాలు, మీడియా సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

ఏం జరిగింది..?

సీన్ రీ క్రియేషన్‌ కోసం పవిత్రను తీసుకెళ్లగా మేకప్ లో హీరోయిన్ కనిపించడం.. ఈ తంతుకు లేడీ ఎస్సై సహకరించడం కన్నడ నాట పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇదంతా పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో ఆ ఎస్సైకు నోటీసులు జారీ చేసిన పరిస్థితి. కస్టడీలో ఉన్న ముద్దాయికి ఇలాంటి స్వేచ్ఛ ఎందుకు ఇస్తున్నారు..? అని సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. 

ఇంత దారుణమా..?

జైలులో ఊచలు లెక్కెడుతూ.. చిప్ప కూడు తింటున్నా కూడా దర్శన్, పవిత్రలో ఎలాంటి పశ్చాతాపం, కనీసం మార్పు రాకపోవడం గమనార్హం. ఒక మనిషిని ఇంత దారుణంగా చంపి.. జైలులో ఉంటూ ఇంతలా ప్రవర్తించడం ఏంటి..? ఇంతకీ ఈ ఇద్దరూ మనుషులా లేకుంటే మృగాలా..? అంతకు మించి రాక్షసులా అని తిట్టి పోస్తున్నారు సినీ ప్రియులు. ఇప్పటికే ఈ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూడగా.. తాజాగా ఈ వ్యవహారం బయటికి వచ్చింది. మున్ముందు ఇంకెన్ని బయటికి వస్తాయో చూస్తూ ఉండాలి మరి.