బాబోయ్.. ‘కల్కి’ మూవీకి తొలిరోజే ఇన్ని కోట్లా..?

దుమ్ము రేపిన కల్కి ప్రి రిలీజ్ బిజినెస్.. బడ్జెట్‌ని మించి వసూల్..! 

టాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు కారం తర్వాత అంత పెద్ద సినిమా ఏదీ థియేటర్లలో విడుదల కాలేదు. ఎన్నో నెలలుగా సినీ ప్రియులు వేచి చూస్తున్న సరికొత్త సినిమా ‘కల్కి’ వచ్చేసింది. అందులోనూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, భారీ తారాగణం నటించడంతో ఈ సినిమా లెవల్ మారిపోయింది. సుమారు 350 కోట్ల రూపాయలు పెట్టి తీసిన ఈ చిత్రం తొలి రోజు ఎన్ని కోట్లు సంపాదించింది..? సినిమా ఎలా ఉంది..? అని తెలుసుకోవడానికి అభిమానులు, తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. 

దుమ్ము లేపేసిందిగా..

కల్కి 2898AD చిత్రంపై పాజిటివ్ టాక్ నడుస్తోంది. కాస్త గ్రాఫిక్ వర్క్ సరిగ్గా లేదని కొందరు చెబుతున్నప్పటికీ మిగిలినది అంతా ఓకే అనే అంటున్నారు. ముందుగా అనుకున్నట్టే తొలిరోజు కల్కి కలెక్షన్ల సునామీ సృష్టించినది. అదెలాగంటే.. తొలిరోజు సాయంత్రానికి లెక్కలు తీయగా రూ.200 కోట్లు అని తెలిసింది. ఐతే 200 కోట్లు పైగానే సంపాదించే అవకాశం ఉందని మరికొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఇదంతా ముందస్తు బుకింగ్ ఆధారంగా అంచనాలు వేస్తున్నట్టు చెబుతున్నాయి. అంతేకాదు తొలిరోజు ఈ రేంజిలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రం కల్కి అని సినీ క్రిటిక్స్ సైతం చెబుతున్న మాట.

టార్గెట్ ఎంత..?

ఇవన్నీ ఒక ఎత్తయితే.. తొలి వారం రూ. 500 కోట్లు పైమాటే అని జాతీయ మీడియా, సినీ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇక మొత్తం కలెక్షన్లు ఇంచు మించు 2 వేల నుంచి 3 వేల కోట్ల దాకా ఉన్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు ఏమో మరి. 6 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని సినిమా యూనిట్ అంచనాలు వేస్తోంది. మొత్తానికి చూస్తే పెట్టుబడి తొలిరోజు ఇంచు మించు వచ్చేయగా ఇక ఎంత వచ్చినా డబుల్, ట్రిపుల్ రెట్లు లాభమే అన్న మాట. పైగా ఇప్పుడు రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలు కూడా లేకపోవడం.. కల్కి మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. మొత్తమ్మీద ఎన్ని కోట్లు వస్తాయో ఏంటో వేచి చూడాలి మరి.