ఎన్నో ఇబ్బందులు.. నిద్ర లేని రాత్రులు గడిపాం : చంద్రబాబు

ఎన్నో ఇబ్బందులు.. నిద్ర లేని రాత్రులు గడిపాం : చంద్రబాబు

అమరావతి: ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ 30 ఏళ్ల వెనక్కు వెళ్లేలా డామేజ్ జరింగిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో గెలుపు అనంతరం తొలిసారిగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ముందుగా ప్రజలకు శిరస్సు వంచి ధన్యావాదాలు చెబుతున్నాన్నారు. సహజ సంపద దోపిడీ యధేచ్ఛగా జరిగిందని.. అసలు రాష్ట్రానికి అప్పులు ఎంతున్నాయో చూడాలన్నారు. నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాలంటే చాలా కష్టపడాలని.. ఇప్పుడు కిం కర్తవ్యం అదేనన్నారు.

ఏదీ శాశ్వతం కాదు..

గతంలో ఉన్న కరెంట్ సంక్షోభాన్ని సంస్కరణలతో గాడిలో పెట్టామన్నారు. ఇప్పుడు మళ్లీ విద్యుత్ సంక్షోభం ఉందన్నారు. గత ప్రభుత్వం 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిందని.. అసలెందుకు పెంచాల్సి వచ్చిందో కూడా తెలియదని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తన జీవితంలో చూడలేదన్నారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లామన్నారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయని.. ఏదీ శాశ్వతం కాదన్నారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వ్యక్తులు.. రాజకీయ పార్టీలు కనుమరుగు అవుతాయన్నారు.

ఎన్నో ఇబ్బందులు.. నిద్ర లేని రాత్రులు గడిపాం : చంద్రబాబు

అలాంటి కార్యకర్తలను ఎలా మరువగలం?

ఎక్కడో దూర తీరాల్లో ఉన్నవాళ్లు.. కూలి పనులు చేసుకునే వాళ్లు కష్టంతో వచ్చి ఓటేశారని పేర్కొన్నారు. టీడీపీ చరిత్రలోనూ.. ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలివని చంద్రబాబు తెలిపారు. అందరం కలిశాం.. ఎన్నికల్లో పోటీ చేశామని.. కంచుకోటను బద్దలు కొట్టామన్నారు. ఈ ఎన్నికలను ఏ విధంగా అభివర్ణించాలో కూడా అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. అహకారం, నియంతృత్వం, విచ్చలవిడి తత్వం వంటివి ప్రజలు సహించబోరన్నారు. ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. నిద్రలేని రాత్రులు గడిపామన్నారు. జై జగన్ అనకుంటే చంపేస్తామన్నా.. లెక్క చేయకుండా జై తెలుగుదేశం అని నినాదాలు చేసిన చంద్రయ్య లాంటి కార్యకర్తలను ఎలా మరువగలమని చంద్రబాబు అన్నారు.