వైరల్ వీడియో: తాడికొండలో బాబు స్పీచ్ ఇచ్చాకే?
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. చివరకు దాడి చేసే వరకూ పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నిన్న సిద్ధం బస్సు యాత్రలో దాడి జరిగిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి విజయవాడ శివారు ప్రాంతమైన సింగ్‌నగర్ లో ఆయనకు ఎటు నుంచి వచ్చిందో ఏమో కానీ ఒక రాయి వచ్చి ఆయన ముఖంపై తగిలింది. అయితే తొలుత ఇది ఎలా జరిగింది.. ఏంటనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.
చంద్రబాబు వీడియో బయటకు వచ్చిన తర్వాతే జగన్‌పై దాడి జరిగింది. ఇంతకీ ఆ వీడియోలో చంద్రబాబు ఏం చెప్పారంటారా? ‘‘ఇప్పుడు రోషం వచ్చింది… మనుషులంతా తలా ఒక రాయి లేదంటే ఏది దొరకితే అది తీసుకుని ఆ దున్నపోతుని చిత్తు చిత్తుగా ఓడించి ఫ్యాన్ అనే మాటే లేకుండా చేయాలని కోరుకుంటున్నా’’ అని చంద్రబాబు ఓ సభలో చెప్పారు. ఆ ప్రసంగం తర్వాతే జగన్‌పై దాడి జరిగింది. కాబట్టి చంద్రబాబే దాడి చేయించారని ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
చంద్రబాబు చెప్పడంతోనే టీడీపీ ముఠా దాడి చేసిందని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు అలా చెప్పిన వెంటనే టీడీపీ పచ్చ ముఠా స్కెచ్ వేసిందని అంటున్నారు. ఆ తరువాత టీడీపీ నేతలు మేటర్‌ను పక్కదారి పట్టించే యత్నం మొదలు పెట్టారు. చంద్రబాబు వచ్చేసి జగన్‌పై దాడిని ఖండిస్తుంటే.. ఆ పార్టీ నేతలు మాత్రం కోడికత్తితో దాడి విషయాన్ని దీన్ని కంపేర్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. చంద్రబాబు కూడా ప్రధాని మోదీ జగన్‌పై జరిగిన దాడిపై స్పందించిన మీదటే అలర్ట్ అయ్యారు. ఎక్కడ ఏం దెబ్బ కొడుతుందోనని దాడిని ఖండిస్తూ ఓ ట్వీట్ చేసి చేతులు దులుపుకున్నారు.