జగన్ పై దాడి: స్వరం మార్చి దొరికిన బాబు!

జగన్ పై దాడి: స్వరం మార్చి దొరికిన బాబు!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్ధం యాత్రతో రాష్ట్రంలో ఓ కదలిక అయితే వచ్చింది. సిద్ధం యాత్ర ద్వారా ఆయన ప్రజల్లో చైతన్యం తీసుకురాగలిగారు. దానిని టీడీపీ జీర్ణించుకోలేకపోయింది. ఎలాగైనా దీనిని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో జగన్ మీద పచ్చ ముఠా దాడి చేయించింది. దీనికి ముందుగానే పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవడమూ జరిగింది. దీనికి అనుగుణంగానే వైసీపీ నాయకులు ఇది కావాలనే చేశారంటూ ఎదురు దాడికి టీడీపీ నేతలు దిగారు. నిజానికి దాడి జరిగిన వెంటనే రాజకీయాలకు అతీతంగా మానవతా కోణంలో దాడిని ఖండించాలి.

అయితే టీడీపీ నేతలు దీనిపై డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు. కవాలనే తనపై తానే హత్యాయత్నం చేయించుకున్నారంటూ మొదలు పెట్టింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఐ టీడీపీ నుంచి జగన్‌పై సోషల్ మీడియా వేదికగా దాడికి దిగారు. టీడీపీ అఫీషియల్ ఖాతా నుంచి కూడా దాడి చేస్తున్నారు. అయితే జగన్‌పై జరిగిన దాడిపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. దీంతో వ్యవహారం చూస్తుంటే ఏదో తేడా వచ్చేలా ఉందే అని వెంటనే దాడిని ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ వేశారు. దీంతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు.

టీడీపీ నుంచేమో వైసీపీ మీద దాడి చేస్తున్నారు. అధినేత మాత్రం ఖండిస్తూ వేరే వర్షన్‌లో ట్వీట్ వేస్తున్నాడు. పైగా టీడీపీ నిన్నటి నుంచి కొత్త వర్షన్‌ను ప్రారంభించింది. జగన్‌పై దాడితో.. కోడికత్తి వెర్షన్‌ను తిరిగి ప్రారంభించింది. టీడీపీతో పాటు నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీసుకున్న స్టాండ్ ఒకటి.. చంద్రబాబు తీసుకున్న స్టాండ్ మరొకటి. అసలు మోదీ ట్వీట్ తర్వాత చంద్రబాబు దాడిని ఖండిస్తూ ట్వీట్ వేయడమేంటి? దాని వెనుక ఉన్న అంతరార్థం ఎవరినీ తెలియదనా? దీనిని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఇక మారడా? అనిప్రశ్నిస్తున్నాయి. జగన్ మీద దాడి చేయించిన చంద్రబాబు బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉంది.

Google News