సీఎం రేవంత్ తో మెగా సుప్రీమ్ హీరో!
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో హీరో సాయి దుర్గ తేజ్ ఈ రోజు (ఆదివారం) భేటి అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
తండ్రి, కూతురి మధ్య ఉన్న అనుబంధానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యేలా చెయ్యడంలో సాయి తేజ్ సోషల్ మిడియా పోస్ట్ పని చేసింది. సాయి తేజ్ ట్విట్టర్ లో పెట్టిన వెంటనే యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు నీచ బుద్దిని గ్రహించింది తెలంగాణ ప్రభుత్వం. దాంతో, సాయి ధరమ్ తేజ్ ని ముఖ్యమంత్రి రేవంత్ ఈ రోజు అభినందించారు.
మొదట్నుంచీ సామాజిక స్పృహ ఉన్న హీరోగా సాయి ధరమ్ తేజ కి పేరుంది. ఇటీవల ‘సత్య’ అనే సామాజిక సందేశంతో కూడిన షార్ట్ ఫిలిం కూడా తీశారు. దేశ సైనికుల త్యాగాలు, వారి కుటుంబ త్యాగాలు అందరికి తెలిసేలా చేసిన సాయి దుర్గా తేజ్ ప్రభుత్వం తరపున చెపట్టే రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేశారు సాయి ధరమ్ తేజ్. అక్కడ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఎ కూటమికి, కాంగ్రెస్ పార్టీకి పడదు. కానీ, తెలంగాణ విషయానికి వస్తే ఎన్డీఎ కూటమి బ్యాచ్ తో రేవంత్ రెడ్డి చాలా “సఖ్యత”గా ఉంటున్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ కలవడం కూడా రకరకాల కామెంట్స్ కి దారి తీసింది.