లావణ్య మరో షాకింగ్ నిర్ణయం

లావణ్య మరో షాకింగ్ నిర్ణయం

హీరో రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలో వార్తల్లో వ్యక్తిగా మారిన లావణ్య అనే అమ్మాయి, మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె నిరాహార దీక్షకు దిగబోతోంది. ముఖ్యంగా 3 డిమాండ్లు తెరపైకి తీసుకొస్తోంది.

లావణ్య మెయిన్ డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. రాజ్ తరుణ్, తనను భార్యగా ఆమోదించి, స్వీకరించాలనేది ఆమె ప్రధాన డిమాండ్. ఇక రెండో డిమాండ్ ఏంటంటే, రాజ్ తరుణ్ జీవితం నుంచి మాల్వీ మల్హోత్రా తప్పుకోవాలి. ఇక మాల్వీ మల్హోత్రా కుటుంబంపై సరైన చర్యలు తీసుకోవాలనేది మూడో డిమాండ్.

లావణ్య మరో షాకింగ్ నిర్ణయం

ఈ 3 డిమాండ్లతో ఆమె రేపోమాపో నిరాహార దీక్షకు దిగబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వేదిక ఎక్కడనేది ఇంకా ఖరారు చేయలేదు.

మరోవైపు లావణ్య ఇష్యూకు సంబంధించి రాజ్ తరుణ్ పై పోలీసులు కేసు నమోదు చేసి, అతడికి నోటీసులు జారీ చేశారు. 18వ తేదీ లోగా విచారణకు రావాలని అందులో అల్టిమేటం ఇచ్చారు.

Google News