Anjali In Chiranjeevi Movie

అంజలి ఎంత మంచి నటి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఇప్పటికే 50 చిత్రాల్లో నటించింది. అటు సినిమాలు చేస్తూనే ఇటు వెబ్ సిరీస్ లు కూడా నటిస్తోంది.

అంజలి తాజాగా నటించిన వెబ్ సిరీస్ … “బహిష్కరణ”. ZEE 5లో స్ట్రీమ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్‌కు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించారు.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.

ఇందులో ఆమె చాలా బోల్డ్ గా నటించింది. అందాలు విప్పి ఆరబోసింది. మాంచి బెడ్ రూం సీన్లు కూడా చేసింది. ఇలా శృంగార సన్నివేశాలతో బోల్డ్ గా నటించడం వెనుక ఉన్న కారణం… ఒక్కటే.

“అవును నాకు కసి, పట్టుదల ఎక్కువ. ఏ పాత్ర ఇచ్చినా మెప్పించాలని కసి ఉంది. ఏదైనా కొత్తగా ట్రై చేయాలనే క్రమంలోనే ‘పుష్ప’ అనే పాత్రను ఎంచుకున్నాను. నటిగా నేను బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాను. అందుకే దర్శకుడి ఆలోచన ప్రకారం నటించాను,” అని చెప్పింది.

Anjali

ఐతే ఈ సిరీస్ లో ఇద్దరు నటులతో బోల్డ్ గా నటించింది. ఎవరితో కంఫర్ట్ గా అనిపించింది అన్న ప్రశ్నకు…నటిగా ఎవరితో అయినా ఓకె, ఒకే తీరు భావన ఉంటుంది అని చెప్పింది.

Google News