Shiva Nirvana: ఓరి నాయనో.. ‘ఖుషి’ స్టోరీ లైన్‌ను కూడా శివ నిర్వాణ లేపేశారట..

Shiva Nirvana: ఓరి నాయనో.. ‘ఖుషి’ స్టోరీ లైన్‌ను కూడా శివ నిర్వాణ లేపేశారట..

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), సమంత(Samantha) జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి(Kushi). ఈ సినిమా విజయం వీరిద్దరికీ కీలకమే. విజయ్ దేవరకొండ వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్నాడు. సమంత కూడా శాకుంతలం సినిమా ఫ్లాప్ అవడంతో కాస్త కష్టాల్లో ఉంది. కాబట్టి ఇద్దరూ కాస్త ఈ సినిమాను చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్ ఖుషి అనే పేరుకి ఒక చరిత్ర ఉన్న విషయం ప్రేక్షకులందరికీ తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కి ఓ రేంజ్‌లో మైలేజ్ ఇచ్చిన మూవీ ఖుషి(Kushi). అప్పట్లో ఇది ఇండస్ట్రీ హిట్. యూత్‌ని ఉర్రూతలూగించింది. అప్పుడే కాదు.. రీసెంట్‌గా రిలీజ్ అయి కూడా రూ.8 కోట్ల గ్రాస్‌ని వసూలు చేసింది.

ఇలాంటి సినిమా టైటిల్ తీసుకుని చెడగొడితే పవన్ ఫ్యాన్స్‌తో లేనిపోని తలనొప్పులు వస్తాయని శివ నిర్వాణ(Shiva Nirvana) కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని టాక్. లేటెస్టుగా ఖుషి మూవీ గురించి ఒక టాక్ వినిపిస్తోంది.

Vijay Deverakonda, Samantha Kushi Movie

ఖుషి(Kushi) సినిమా టైటిలే కాదు.. స్టోరీ లైన్ కూడా కాపీ చేశారట శివ నిర్మాణ. ఒక సినిమా నుంచి టైటిల్‌తో పాటు స్టోరీ లైన్ లేపేయడం ఇదే తొలిసారి కావొచ్చు. ఈగో ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కుతోందని టాక్.

ప్రాణంగా ప్రేమించుకున్న ప్రేమికులిద్దరూ ఈగో కారణంగా విడిపోయి చివరకు ఎలా కలిశారనేది స్టోరీ అట. ఇలా స్టోరీ లైన్ లేపేయడం ఇండస్ట్రీలో కొత్తేం కాదు కానీ తేడా వస్తేనే పవన్ ఫ్యాన్స్‌ని తట్టుకోవడం కాస్త కష్టం. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Google News