Renu Desai: పవన్‌ని రేణు దేశాయ్ టార్గెట్ చేశారా? అందుకేనా ఆ ఇంటర్వ్యూ?

Renu Desai: పవన్‌ని రేణు దేశాయ్ టార్గెట్ చేశారా? అందుకేనా ఆ ఇంటర్వ్యూ?

జనసేన అధినేత మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అవుతున్నారు. ఆమె నెట్టింట బాగా పాపులర్ అవడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అప్పుడప్పుడు బుల్లితెరపై మెరుస్తూ ఉండే రేణు దేశాయ్.. ఓ డ్యాన్స్ షోకి జడ్జిగా కూడా వ్యవహరించారు. ఇక ఇటీవలి కాలంలో రేణు(Renu Desai) సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతున్నారు. పవన్‌ అభిమానులపై నిప్పులు కురిపిస్తున్నారు.

తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి తనకి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో పాటు పిల్లలు అకీరా నందన్, ఆద్యకి సంబంధించిన విషయాలను కూడా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో ఒక నెటిజన్ పవన్(Renu Desai) కొడుకు అకీరా(Akira)ను చూపించాలని ఆమె ఎందుకోగానీ నానా రాద్దాంతం చేశారు. అకీరా తన కొడుకని అన్న కొడుకు ఏంటంటూ సదరు నెటిజన్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ఇక ఇప్పుడు రేణు దేశాయ్(Renu Desai).. కమింగ్ సూన్ అంటూ ఆమెకు సంబంధించిన లేటెస్ట్‌ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇంటర్వ్యూ పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ని టార్గెట్ చేసేందుకు రేణు చేశారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో పవన్ చాలా కీలకంగా మారారు. ఈ సమయంలో ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుందుకు రేణు నిర్ణయించుకున్నారని.. అందుకే సరిగ్గా సమయం చూసుకుని ఇలాంటి ఇంటర్వ్యూలను చేసి వదులుతున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!