Dasara, Virupaksha: దసరా, విరూపాక్ష.. వసూళ్లలో ఏది బెస్ట్ అంటే…
ఇటీవలి కాలంలో మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి. బలగం(Balagam), దసరా(Dasara), విరూపాక్ష(Virupaksha). బలగం(Balagam) సినిమా ఎలాంటి అంచనాలూ లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అంతర్జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. దీన్ని పక్కనబెడితే దసరా, విరూపాక్ష రెండూ కూడా పెద్ద హీరోల సినిమాలే. శ్రీకాంత్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా దసరా. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా విరూపాక్ష. ఈ రెండు సినిమాల్లో జనాలకు ఏది చేరువైంది?
దసరా(Dasara) సినిమాను రూ.70 కోట్లతో తెరకెక్కించగా.. విరూపాక్ష(Virupaksha)ను రూ.40 కోట్లతో రూపొందించారు. అయితే దసరా మూవీ మాత్రం నష్టాల్లేకుండా బయటపడగలిగిందని టాక్. విరూపాక్ష 45 కోట్ల మేరకు మార్కెట్ చేసింది. దసరా మూవీ ఖర్చులో రూ.20 కోట్లు నాని రెమ్యూనరేషన్‌కే వెళ్లగా.. విరూపాక్ష సినిమాకు సాయి ధరమ్ రూ.8 కోట్లు తీసుకున్నాడు. ఇక దసరా థియేటర్ రైట్స్ రూ.24 కోట్లు అయితే విరూపాక్ష రూ.22 కోట్లు. దసరాకు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. కానీ విరూపాక్షకు ఆశించిన స్థాయిలో రాలేదు.
కానీ దసరా మూవీ కలెక్షన్స్(Dasara Collections) మూడు రోజుల్లో పడిపోయాయి. ముఖ్యంగా ఏపీలో ఈ సినిమా దెబ్బేసింది. కొన్ని ప్రాంతాల వాసులకు సినిమా యాక్సెంట్ అర్ధం కాకపోవడం వల్ల కూడా దెబ్బ పడింది. కానీ విరూపాక్ష సినిమా మౌత్ టాక్‌తో రెండు రోజుల్లోనే పుంజుకుంది. వారం తిరిగి బయ్యర్లంతా సేఫ్ అయిపోయారు. ఇక దసరా మూవీ ఓవర్సీస్‌లో రెండు మిలియన్లు వసూలు చేయగా.. విరూపాక్ష కాస్త లేటుగా విడుదలైనా.. ఇప్పటికే వన్ మిలియన్ దాటేసింది. ఇక టోటల్‌గా చెప్పాలంటే.. దసరా కంటే విరూపాక్ష కలెక్షన్స్ ది బెస్ట్ అని.