Radhika Apte: మహిళలకు అంత త్యాగం చేయాల్సిన అవసరం లేదు: రాధికా ఆప్టే
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) రక్త చరిత్ర సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషనల్ భామ రాధికా ఆప్టే(Radhika Apte). ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పడు ఏదో ఒక సంచలనానికి తెరదీస్తూనే ఉంటుంది.
ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ నుంచి రెమ్యూనరేషన్, హీరో డామినేషన్ వంటి ఎన్నో సమస్యలపై గళం విప్పుతున్న వారిలో రాధికా ఆప్టే(Radhika Apte) కూడా ఒకరు. విషయం ఏదైనా సరే.. ఏమాత్రం తడుముకోకుండా కుండబద్దలు కొట్టేస్తుంది.
నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన సూపర్ హిట్ మూవీస్ లెజెండ్(Legend), లయన్(Lion) వంటి సినిమాల్లో మెరిసిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసే ఈ ముద్దుగమ్మ మరో సంచలనానికి తెరదీసింది. నిజానికి ఆమె మాట్లాడిన మాటలన్నీ అక్షరాలా నిజమే. దీంతో ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం మహిళల సపోర్ట్ కావల్సినంతగా లభిస్తోంది.
తాజాగా సమానత్వం గురించి ఈ ముద్దుగుమ్మ ఓ సందర్భంలో మాట్లాడింది. తన తండ్రికి ఆసుపత్రి ఉండేదని.. దానిలోనే తన తల్లి కూడా పని చేసేదని వెల్లడించింది. ఇక ఆసుపత్రి నుంచి ఇంటికి రాగానే కుటుంబ బాధ్యతలు కూడా నిర్వర్తించడంతో పాటు ఎవరికి ఏం కావాలన్నా సమకూర్చేదని వెల్లడించింది. బాల్యం నుంచే ఆడివారికి ఇంటి పనులు అలవాటు చేస్తున్నారని.. మహిళలు అంత త్యాగం చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కుటుంబంలోని వారంతా తలా ఒక పని చేస్తే సరిపోతుందని తెలిపింది. ఇప్పుడు రాధికా ఆప్టే(Radhika Apte) మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.