Amala Akkineni: ఏజెంట్ ట్రోలింగ్‌పై అమల ఏమన్నారంటే..

Amala Akkineni: ఏజెంట్ ట్రోలింగ్‌పై అమల ఏమన్నారంటే..

అఖిల్ అక్కినేని(Akhil Akkineni), సురేందర్‌రెడ్డి కాంబోలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’(Agent). ఈ సినిమా భారీ అంచనాలతో ఈ నెల 28న థియేటర్‌లలోకి వచ్చింది. కానీ ఫలితం తీవ్ర నిరాశను మిగిల్చింది.

అఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందిన సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా కోసం అఖిల్(Akhil Akkineni) చాలా కష్టపడ్డాడు. అతని కష్టమంతా సినిమాలో కనిపించింది. కానీ ఫలితమే చేదు అనుభవాన్ని మిగిల్చింది. 

ఈ సినిమాపై నెట్టింట విమర్శలు, ట్రోల్స్ మామూలుగా రావడం లేదు. దర్శకుడు సురేందర్‌రెడ్డి(Surender Reddy) సహా హీరో అఖిల్‌(Akhil Akkineni)ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఒక వర్గం ప్రేక్షకులైతే అఖిల్‌కు ఫుల్ సపోర్టుగా నిలుస్తున్నారు. కానీ ట్రోలింగ్సే అఖిల్ తల్లి అమలను కాస్త ఇబ్బంది పెట్టినట్టున్నాయి.

దీంతో ఆమె ట్రోలింగ్‌పై ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. తాను ట్రోలర్స్‌ని అర్థం చేసుకున్నాన్నారు. ఇదొక డీప్ అభద్రతాభావం నుంచి వస్తుందని అమల తెలిపారు.

తాను ఏజెంట్(Agent) చూశానని సినిమాను సిన్సియర్‌గా ఎంజాయ్ చేశానన్నారు. దీనిలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయని.. మీరు కాస్త మైండ్ పెడితే కచ్చితంగా ఎంజాయ్ చేస్తారన్నారు. తాను వెళ్లినప్పుడు థియేటర్ ఫుల్ అయ్యిందని.. సగం మంది లేడీసే ఉన్నారని తెలిపారు. యాక్షన్ సన్నివేశాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు అరుపులు, కేకలతో తెగ ఎంజాయ్ చేశారన్నారు. ఇక నెక్ట్స్ మాత్రం చాలా హెవీగా.. మరింత ఉన్నతంగా ఉంటుందని అమల వెల్లడించారు.

Google News