Tollywood: టాలీవుడ్ హీరోలు హిట్.. డైరెక్టర్లు ఫట్..
సినిమా హిట్ ఫట్ వెనుక ప్రధాన కారణాల్లో ఒకరు డైరెక్టర్. కానీ నేరుగా ఎఫెక్ట్ పడేది మాత్రం ఆ చిత్ర హీరోహీరోయిన్ల మీదే. పరోక్షంగా డైరెక్టర్ మీద కూడా పడుతుంది కానీ వీరిద్దరికి పడినంత దెబ్బ దర్శకుడికి మాత్రం పడదనడంలో సందేహం లేదు. ఇక డైరెక్టర్, హీరో కలిసి కట్టుగా చేస్తేనే సినిమా సక్సెస్ అయ్యే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే లైగర్(Liger), ఏజెంట్(Agent) సినిమాలు సరికొత్త విషయాన్ని నిరూపించాయి. ఈ రెండు సినిమాల విషయంలో హీరోలు హిట్.. డైరెక్టర్లు ఫట్.
డియర్ కామ్రేడ్(Dear Comrade) నుంచి వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్న విజయ్.. ఇక కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు సరైన అవకాశంగా లైగర్(Liger)ను ఎంచుకున్నాడు. ఈ ప్రాజెక్టుకు పూరి జగన్నాథ్(Puri Jagannadh) దర్శకత్వం వహించారు. సిక్స్ ప్యాక్ బాడీతో రెజ్లర్‌గా కనిపించేందుకు విజయ్(Vijay Deverakonda) చాలా కష్టపడ్డాడు. కానీ మూడేళ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది. పూరి వచ్చేసి కథ, కథనం, డైలాగ్స్ వంటి విషయాల్లో టోటల్‌గా ఫెయిల్ అయ్యారు. కేవలం పూరి కారణంగా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక అక్కినేని అఖిల్(Akhil Akkineni). ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే అయ్యగారు. తన కెరీర్‌లో ఇంతవరకూ హిట్ పడలేదు. ఈ సినిమా సక్సెస్ కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. స్పైగా కనిపించేందుకు సిక్స్ ప్యాక్ చేశాడు. మేకోవర్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా తనని తాను చాలా చేంజ్ చేసుకున్నాడు. కానీ ఫలితం మాత్రం నిరాశలో ముంచేసింది. ఏజెంట్(Agent) విషయంలోనూ దర్శకుడే ఫెయిల్. అఖిల్ ఫిజిక్ విషయంలో పెట్టిన దృష్టి సినిమాను ప్రెజెంట్ చేయడంపై పెట్టలేకపోయారు. సినిమా కోసం ఎంతగానో శ్రమించిన అఖిల్‌కు ఇది పెద్ద షాక్.