Karnataka Elections : బ్రహ్మానందం ప్రచారం నిర్వహించిన అభ్యర్థి సైతం ఓటమి..

Karnataka Elections : బ్రహ్మానందం ప్రచారం నిర్వహించిన అభ్యర్థి సైతం ఓటమి..

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం(Brahmanandam) ఏనాడు ఎన్నికల్లో ఏ అభ్యర్థి తరుఫున కూడా ప్రచారం నిర్వహించింది లేదు. ఎప్పుడూ కూడా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూనే వచ్చారు. అలాంటిది ఎందుకో కానీ కర్ణాటక రాజకీయంలో మాత్రం వేలు పెట్టారు.

చిక్ బళ్లాపూర్ నియోజకవర్గం బీజేపి(BJP) అభ్యర్థి సుధాకర్‌కి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా.. ఆయన తరుఫున ప్రచారం కూడా నిర్వహించారు. నిజానికి చిక్ బళ్లాపూర్‌లో తెలుగు మాట్లాడేవారు ఎక్కువ. కాబట్టి బీజేపీ నేతలు తమ పార్టీ అభ్యర్థి తరుఫున ప్రచారం నిర్వహించేందుకు బ్రహ్మీ(Brahmanandam)ని రంగంలోకి దింపారు.

కానీ కర్ణాటక ఎన్నికల్లో(Karnataka Elections) ఓటమి పాలైన పలువురు మంత్రుల్లో డాక్టర్ కె. సుధాకర్ కూడా ఒకరు. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. వైద్య శాఖలో డాక్టర్ సుధాకర్ ఎంతగానో సేవలందించారని.. కాబట్టి అంతా ఆయనకు ఓటు వేసి గెలిపించాలని బ్రహ్మీ చిక్ బళ్లాపూర్ ప్రజానీకాన్ని అర్థించారు. కానీ బ్రహ్మీ(Brahmanandam) రంగంలోకి దిగినా కూడా వర్కవుట్ కాలేదు.

బీజేపీపై ఉన్న వ్యతిరేకతో లేదంటే డాక్టర్ సుధాకర్‌పై ఉన్న వ్యతిరేకతో కానీ మొత్తానికి సుధాకర్ ఓటమి పాలయ్యారు. మొత్తానికి బ్రహ్మీ రోడ్డుపై తిరుగుతూ ప్రచారం చేసినా కూడా ఫలితం దక్కలేదు.