Bandla Ganesh: మళ్లీ రాజకీయాల్లో బండ్ల గణేష్..

Bandla Ganesh: మళ్లీ రాజకీయాల్లో బండ్ల గణేష్..

నటుడు, నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్(Bandla Ganesh) మరోసారి బాంబ్ పేల్చారు. తనకు రాజకీయాలు సెట్ కావని.. ఇకపై సెలవని పలు ఇంటర్వ్యూలలో ఊదరగొట్టిన బండ్ల గణేష్(Bandla Ganesh) మరోసారి మాట తప్పరు. తాజాగా ట్విటర్ వేదికగా ఆయన చేస్తున్న ట్వీట్లు అందరినీ నివ్వెరబోయేలా చేస్తున్నాయి. రాజకీయాల్లోకి వచ్చి నిఖార్సైన రాజకీయాలు చేస్తారట. మరి అంతకు ముందు చేసిందేంటో తెలియాల్సి ఉంది.

నిజానికి బండ్ల గణేష్(Bandla Ganesh) కాంగ్రెస్ పార్టీ అభిమాని. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో స్పష్టం చేశాడు కూడా. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంలో కూడా ట్వీట్స్‌తో ఊదరగొడుతున్నారు.

రాజకీయాల విషయంలో చాలా కాలంగా కామ్‌గా ఉంటూ వస్తున్న బండ్ల గణేష్(Bandla Ganesh) తిరిగి యాక్టి్వ్ అయ్యారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించడమే కాదు.. వరుస ట్వీట్స్ చేశారు. ‘‘నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం. నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా. బానిసత్వానికి భాయ్ భాయ్ నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై. రాజకీయాలంటే నిజాయితీ.. రాజకీయాలంటే నీతి.. రాజకీయాలంటే కష్టం.. రాజకీయాలంటే పౌరుషం.. రాజకీయాలంటే శ్రమ.. రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి.. అందుకే వస్తా.’’ అంటూ వరుస ట్వీట్స్‌తో ఊదరగొట్టేస్తున్నారు బండ్ల గణేష్.

Google News