Karnataka Election Results: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం.. బీజేపీ ఘోర పరాజయానికి కారణాలేంటంటే..
హమ్మయ్యా.. దక్షిణాదిలో బీజేపీ(BJP)కి డోర్స్ క్లోజ్ అయ్యాయని కొందరు.. హస్తం పార్టీ తిరిగి ప్రాణం పోసుకునేందుకు అవకాశం దొరికిందని కొందరు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు సైతం అందని రిజల్ట్Karnataka Election Results:ను కర్ణాటక ప్రజలు ఇచ్చారు. కింగ్ మేకర్ అవుతారనుకున్న జేడీఎస్ అధినేత కుమారస్వామి ఆశలకు సైతం ఓటర్లు గండి కొట్టేశారు. బీజేపీ, జేడీఎస్(JDS), స్వతంత్ర అభ్యర్థులు కలిసినా అందనంత ఎత్తులో కాంగ్రెస్ పార్టీని నిలిపారు. మరి ఆ పార్టీ అంతటి ఘన విజయం సాధించడానికి కారణాలేంటో చూద్దాం.
ముందుగా నేతల ఐకమత్యం. తమ మధ్య ఎన్ని విభేదాలున్నా వాటిని బయటకు రాకుండా పరిష్కరించుకుని నేతలంతా ఒక తాటిపై నడిచారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shiva Kumar), మాజీ సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) ఐకమత్యంగా ఉంటూ పార్టీని నడిపించారు. ఇది పార్టీ విజయానికి బాగా కలిసొచ్చింది.
ఇక గత ఎన్నికల్లో జేడీఎస్(JDS)తో కలిసి ఏర్పాటు చేసిన కాంగ్రెస్(Congress Party) ప్రభుత్వాన్ని మూణ్ణాళ్ల ముచ్చట చేసేసింది. ఇది జనాల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ నేతలు సక్సెస్ అయ్యారు. ఇక బీజేపీ బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai) సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత సర్కార్‌పై అవినీతి ఆరోపణలకు అంతే లేకుండా పోయింది. ‘40శాతం కమీషన్ సర్కార్’అనే నినాదాన్ని సక్సెస్‌ఫుల్‌గా కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి తీసుకెళ్లింది. ఇక హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఏ వ్యూహంతో అయితే విజయం సాధించారో.. దానినే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా ప్రయోగించింది.
ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. గృహిణులకు ఒక్కొక్కరికి నెలకు రూ.2,000 ఆర్థిక సహాయం.. నిరుపేద కుటుంబాలకు 10 కిలోల ఉచిత బియ్యం, నిరుద్యోగ పట్టభద్రులు, డిప్లొమా పట్టాదారులకు నెలకు రూ.3,000, రూ.1,500 చొప్పున నిరుద్యోగ భృతి వంటి హామీలను కాంగ్రెస్ పార్టీ గుప్పించింది. ఇక భారత్ జోడో యాత్ర (Bharath Jodo Yatra) కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి బలంగా మారింది. వెరసి కాంగ్రెస్ పార్టీ ఊహించని ఫలితాన్ని తన ఖాతాలో వేసుకుంది.