MP Avinash Reddy: ఎంపీ అవినాశ్‌కు షరతులతో కూడిన బెయిల్
వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా ఈ కేసులో కీలక సూత్రధారిగా సీబీఐ అభియోగాలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(MP Avinash Reddy) అరెస్ట్ అవుతారన్న ఉత్కంఠ కొనసాగింది. అయితే ఆయనకు నేడు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అవినాశ్(Avinash Reddy) తల్లి అనారోగ్యం దృష్ట్యా బుధవారం వరకూ అవినాశ్‌ను అరెస్ట్ చేయొద్దని సీబీఐని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు.. నేడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే అవినాశ్‌కు కొన్ని షరతులను విధించింది.
రూ.5 లక్షల పూచీకత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు అవినాశ్(MP Avinash Reddy)కు షరతు విధించింది. అలాగే.. సీబీఐ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని.. జూన్ చివరి వరకూ ప్రతి శనివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సీబీఐ ఎదుట హాజరుకావాలని.. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని హైకోర్టు అవినాశ్ రెడ్డి(MP Avinash Reddy)కి స్పష్టం చేసింది. కాగా.. అవినాశ్ ముందస్తు బెయిల్‌పై వివేకా కూతురు సునీత తరుపు న్యాయవాది మెమో దాఖలు చేశారు. అవినాశ్ తల్లికి ఎలాంటి సర్జరీ జరగలేదని కాబట్టి అవినాశ్ న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని సునీత మెమోలో పేర్కొన్నారు.