Rishabh Pant Car Accident: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్

Rishabh Pant Car Accident

భారత క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) కారు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. రిషబ్ పంత్ ఉత్తరాఖండ్‌లోని స్వస్థలమైన రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే రిషబ్ ను ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో రిషబ్‌ పంత్‌ (Rishabh Pant) ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో.. రిషబ్‌ పంతే తన కారును డ్రైవ్‌ చేస్తున్నట్లు తెలిసింది.

Rishab Pant

వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం పంత్ (Rishabh Pant) నుదుటిపైన, కాలికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ దేహత్ స్వప్న కిషోర్ సింగ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం రిషబ్ పంత్ పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు . ప్రస్తుతం అతన్ని రూర్కీ నుంచి ఢిల్లీకి రిఫర్ చేస్తున్నట్లు సక్షమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుశీల్ నగర్ తెలిపారు.

నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ) చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ట్విట్టర్‌లో ఇలా పోస్ట్ చేసారు.. పంత్ ప్రమాదం నుండి బయటపడ్డాడు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు.

Google News