వినుకొండ దారుణం… నిందితుడు టీడీపీ కార్యకర్తే!

Vinukonda

వినుకొండలో దారుణమైన, ఘోరమైన హత్యాకాండ జరిగింది. ఒక పార్టీ కార్యకర్తని మరో పార్టీ కార్యకర్తలు వేటాడి, పాశవికంగా చంపారు. రెండు చేతులు నరికేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షేక్ అబ్దుల్ రషీద్ (27) బుధవారం రాత్రి వినుకొండలో తన ఇంటికి వెళ్తుండగా జిలానీ మరో ఇద్దరితో కలసి కొబ్బరి బొండాల కత్తితో మీద పడ్డాడు. మొదట రషీద్ కుడి చెయ్యి తెగి పడింది. అయినా ఆగకుండా అతన్ని జిలాని నరుకుతూనే ఉన్నాడు. రెండు చేతులూ నరికేసి వెల్లిపోయాడు. ఆ తర్వాత పోలీసులకు హత్యాయుధాన్ని అప్పగించి లొంగిపోయాడు. రషీద్ పాశవిక హత్యతో మరోసారి ఆంధ్రప్రదేశ్ హింసాత్మక రాజకీయ దాడులు దేశవ్యాప్త చర్చకు దారి తీశాయి.

నిందితుడు జిలాని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని రూఢి అయింది. లోకేష్ జన్మదిన వేడుకల్లో, 2024 ఎన్నికల ప్రచారంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యే GV ఆంజనేయులుతో జిలాని తిరిగిన ఫోటోలు బయటికి వచ్చాయి.

Google News