ఇదీ వైఎస్ జగన్ రేంజ్.. జీఎస్టీ వసూళ్ళలో ఏపీ టాప్!

ఇదీ వైఎస్ జగన్ రేంజ్.. జీఎస్టీ వసూళ్ళలో ఏపీ టాప్!

రౌతు సరైనోడు దొరకాలి కానీ కుంటి గుర్రం కూడా రేసు గుర్రమై కూర్చుంటుందట. సరైన గురువు దొరికితే సాధారణ విద్యార్థి సైతం ఆలిండియా ర్యాంకులు కొట్టేస్తాడు. ఇక కుటుం పెద్ద బాధ్యత కలిగిన వాడైతే ఆ ఇంట సిరి సంపదలకు లోటుండదు. ఈ క్రమంలోనే పాలకుడు సమర్థుడైతే రాష్ట్రం ఆర్థికంగా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రగతి పథంలోకి వెళ్లడం ఖాయం. ఏ రాష్ట్రానికైనా పన్నులే ఆదాయ మార్గం. వాటిని పెంపొందించుకుని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడమనేది పాలకుడి బాధ్యత. ఆ బాధ్యతను అయితే ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పక్కాగా అమలు చేస్తున్నారు.

అగ్రస్థానంలో ఏపీ, కర్ణాటక..

ఏపీలో అమలవుతున్న వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక విధానాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. వాణిజ్య విధానాలను సులభంగా అమలు చేయడంలోనూ, దేశీయ విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలోనూ సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ గొప్ప ప్రగతి సాధించినట్లు కేంద్రం విడుదల చేసిన నివేదికల్లో ఇప్పటికే వెల్లడైంది. అక్టోబర్ 2023 వరకూ జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటులో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల ద్వారా స్పష్టమైంది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ ఆదాయం 12% వృద్ధి రేటుతో రూ. 18,488 కోట్లుగా ఉంది.

ఇదీ వైఎస్ జగన్ రేంజ్.. జీఎస్టీ వసూళ్ళలో ఏపీ టాప్!

పాలనా సంస్కరణలు, పారదర్శక విధానాలే కారణం..

ఇక ఏపీ మాదిరిగానే దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక కూడా 12% వృద్ధి రేటుతో దూసుకెళుతుండగా.. తెలంగాణ 10%, తమిళనాడు 9%, కేరళ 5% వృద్ధి రేటును నమోదు చేశాయి. భారతదేశ వ్యాప్తంగా అక్టోబర్‌లో స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,72,003 కోట్లుగా ఉంది. మొత్తంగా రూ.30,062 కోట్లు సెంట్రల్ జీఎస్టీ, రూ.38,171 కోట్లు స్టేట్ జీఎస్టీ, రూ.91,315 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 42,127 కోట్లతో కలిపి) ఐజీఎస్టీ, రూ.12,456 కోట్లు (రూ. 1,294 కోట్లతో సహా) వస్తువుల దిగుమతిపై వసూలయ్యాయి. మొత్తం మీద చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్నుల ఆదాయంలో దూసుకుపోతోంది. దీనికి సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, పారదర్శక విధానాలే కారణమని నిపుణులు అంటున్నారు.

Google News