చంద్రబాబును చెప్పుతో కొడతా… అంటూ టీడీపీ కార్యకర్త గరం గరం

చంద్రబాబును చెప్పుతో కొడతా… అంటూ టీడీపీ కార్యకర్త గరం గరం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన మోసానికి చెప్పుతో సమాధానం చెబుతామని సొంత పార్టీ కార్యకర్తలు తెలిపారు. నిన్న మొన్నటి వరకూ దేవుడు అంటూ భజన చేసిన కార్యకర్తలే ఇప్పుడు దెయ్యమంటూ మండిపడుతున్నారు. ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో తెలుగు తమ్ముళ్లలో టికెట్ కోసం కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. అవి ఓ రేంజ్‌కి వెళ్లిపోయి తిరగబడటం కూడా జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసేందుకు ఎందరో నేతలు పోటీ పడుతున్నారు. వారందరికీ టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. అది టీడీపీ నేతల్లో సెగలు పుట్టిస్తోంది. అరకులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. మాజీ మంత్రి సమావేశాన్ని అడ్డుకోవడమే కాకుండా టీడీపీ నేతకు అబ్రహాంకు అన్యాయం చేశారంటూ నినాదాలు చేశారు.

చంద్రబాబును చెప్పుతో కొడతా… అంటూ టీడీపీ కార్యకర్త గరం గరం

అబ్రహాంకు టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ నక్కా ఆనంద్ బాబుపై టీడీపీ కేడర్ ఫైర్ అయ్యింది. మావోయిస్ట్ చేతిలో హతమైన మాజీ ఎమ్మెల్యే సోము తనయుడే అబ్రహం. అబ్రహం తనయుడికి అన్యాయం చేస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. ఆఖరి వరకూ అబ్రహాంకు టికెట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారట. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ఇది అరకులో ఒక్కచోటే కాదు.. ఏపీ అంతటా ఇదే జరుగుతోంది.

Google News