పబ్బులో గబ్బు లేపిన టీడీపీ ఎంపీ.. మందేసి.. చిందేసి.. ఆపై

పబ్బులో గబ్బు లేపిన టీడీపీ ఎంపీ.. మందేసి.. చిందేసి.. ఆపై

చట్ట సభల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు ప్రజా ప్రతినిధులు. అది అధికార పక్షం అయితే సుతిమెత్తగా మాట్లాడుతారు. విపక్షమైతే కరాఖండిగా ప్రశ్నిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక రాజభోగాలు అనుభవించేవారు కొందరు. ఇలాంటి వాళ్లు సమాజానికి మేలు చేస్తున్నామనే ట్యాగ్ వేసుకుని చట్టసభల్లో తమ ప్రాంత ఊసే ఎత్తరు.

టీడీపీకి చెందిన ఓ ఎంపీ ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడమే కాకుండా.. విలాసాలకు అలవాటు పడ్డాడట. ఢిల్లీలో ప్రజల సమస్యలపై పోరాడతానని చెప్పి.. కష్టపడింది చాలనుకున్నారో ఏమో ఆయన పబ్బుకు వెళ్లాడట. అక్కడ ఫుల్లుగా తాగేసి పడిపోయాడట.

తాగిన మైకంలో చిత్రవిచిత్ర డ్యాన్సులు చేసి పాలిటిక్స్ లోనే కాదు.. పబ్ డ్యాన్స్ ల్లో కూడా తానే మిన్న అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడట. చివరికి కిందపడిపోయిన ఆయన్ని సహచరులు పక్కకు తీసుకెళ్లి సపర్యలు చేసేసరికి నార్మల్ అయ్యాడట. ఈ విషయం బయటకి రాకుండా ఉండేందుకు టీడీపీ ఎంపీలు అక్కడి పోలీసులను మ్యానేజ్ చేసినట్లు తెలిసింది.

ప్రజాప్రతినిధిని చేసి సమస్యలపై పోరాటం చేయడానికి పంపితే ఇవేం పనులు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట ఆ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలు.

Google News