బాబోయ్.. ఇండియాలోనే అతిపెద్ద స్కామ్.. బ్యాంకులకు వేల కోట్లు రాయపాటి ఎగనామం!

బాబోయ్.. ఇండియాలోనే అతిపెద్ద స్కామ్.. బ్యాంకులకు వేల కోట్లు రాయపాటి ఎగనామం!

మీమీద ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తాను అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగంగానే ప్రకటించింది నిజమే అనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో బ్యాంకులకు టోకరా వేయడం.. తప్పుడు లెక్కలు చూపడం.. వంటివి జరిగిన ఘటనలను కొన్ని చూశాం. అయితే టీడీపీ హయాంలో మరో నేత బ్యాంక్‌లను బురిడీ కొట్టించారు.

ఇప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేశ్, నామా నాగేశ్వరరావు, జేసీ బ్రదర్స్ తదితరులు అక్రమ వ్యాపారాలు, మనీ లాండరింగ్ కేసుల్లో చిక్కుకోగా.. ఇప్పుడు రాయపాటి సాంబశివరావు కూడా డొల్ల కంపెనీలతో మోసాలకి పాల్పడినట్లు తేలింది.

Advertisement

రాయపాటి దేశంలోనే అతి పెద్ద లోన్ స్కామ్‌‌‌కి పాల్పడినట్టు ఈడీ గుర్తించింది. విచారణలో మరికొంత మంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి.

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు 13 బ్యాంక్‌లలో రూ.9394 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఆ డబ్బుని షెల్ కంపెనీలకి తరలించారు. అనంతరం ఆ నగదు మొత్తం రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ బ్యాంకు ఖాతాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్‌కు ఈ నగదు బదిలీ అయిందని ఈడీ గుర్తించింది.

రాయపాటిపై గతంలోనే సీబీఐ సోదాలు నిర్వహించింది. 2019 లోనే బ్యాంకు రుణాల ఎగవేత కేసులో రాయపాటి ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ సోదాలు జరిపింది.

మంగళవారం మనీలాండరింగ్ కేసులో భాగంగా రాయపాటి ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాల్ని స్వాధీనం చేసుకుంది. ఆ రుణం ఇప్పుడు వడ్డీతో కలిపి దాదాపు ముప్పయి వేల కోట్లకు చేరినట్లు బ్యాంకు లెక్కలు తేల్చాయి.

ఎంత మంది టీడీపీ నేతలు ఇలా మనీలాండరింగ్‌కి పాల్పడ్డారు?

అప్పట్లో సుజనా చౌదరి, సీఎం రమేశ్ ఆగమేఘాలపై బీజేపీలో చేరిపోయారు. అయితే మనీలాండరింగ్ కేసుల భయంతో చంద్రబాబు సూచనల మేరకే బీజేపీలో చేరారని అప్పట్లో భారీగా ప్రచారం జరిగింది. ఇప్పుడు రాయపాటి‌ కూడా త్వరలో బీజేపీలో చేరవచ్చనే టాక్ నడుస్తోంది. ఇంకా ఎంత మంది టీడీపీ నేతలు ఇలా మనీలాండరింగ్‌కి పాల్పడ్డారనే దానిపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మరోవైపు రామోజీ వంటి వారంతా చంద్రబాబు అండచూసుకుని వేలకోట్లు పోగేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అలా వచ్చిన డబ్బు మళ్ళీ పార్టీ కోసం..ఎన్నికల కోసం ఖర్చు చేసి తమ రుణం తీర్చుకుంటారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. పార్టీ రుణం అయితే తీరుస్తారు కానీ బ్యాంకులకు కట్టాల్సిన రుణం మాత్రం తీర్చరని ఎద్దేవా చేస్తున్నారు.