Deepika Padukone: చీకట్లో ఆశ.. లుక్ కాపీ కొట్టమేంటి దీపికా..!

Deepika Padukone 1

ప్రమోషన్స్ టెక్నిక్స్ తెలిస్తే చాలు.. సినిమాను జనాల్లో ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఈ టెక్నిక్స్ బాలీవుడ్ భామ దీపికా పదుకొణె (Deepika Padukone) కు వెన్నతో పెట్టిన విద్య అట. ప్రమోషన్స్ కోసం కొత్త కొత్త షేడ్స్‌ను వినియోగించడం వంటివి బాగా అమలు చేస్తుందట. అమ్మడు ఇటీవలి కాలంలో దక్షిణాదిపై బాగా ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే తెలుగు సినిమాల్లో సైతం మెరుస్తోంది.

Deepika Look In Project K

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే (Project K) చిత్రంలో దీపిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఆమె పోస్టర్‌ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌పై చీకట్లో ఆశ అనే క్యాప్షన్ ఇచ్చారు.ఆ పోస్టర్ డిజైన్ నిజంగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎత్తైన కొండపై దీపికా పదుకొణే (Deepika Padukone) ఉంది. బ్యాక్ డ్రాప్‌లో సూర్యకాంతి.. ఒక షాడో ఇమేజ్‌లా ఉంది.

Deepika Look In Project

ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది కానీ ట్రోల్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇది గత ఏడాది రిలీజైన హాలీవుడ్ మూవీ DUNE కి కాపీ అని నెటిజన్లు తేల్చి పారేశారు. దీంతో ఇది హాట్ టాపిక్‌గా ఎలాగైతేనేమీ జనాల నోళ్లలో మాత్రం బాగానే నానుతోంది. సైన్స్ ఫిక్షన్‌గా ఈ మూవీ రూపొందుతోంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వినీద‌త్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు.

Google News