Rashmika Mandanna: అమ్మో రష్మిక.. సమంతకు అమ్మనవుతానన్నది అందుకా..!

rashmika mandanna on samantha

నేషనల్ క్రష్ రష్మిక, స్టార్ హీరోయిన్ సమంత (Samantha)ల మధ్య కొంత కాలం క్రితం గట్టి వారే నడిచింది. అప్పట్లో వీరిద్దరూ హాట్ టాపిక్‌గా నిలిచారు. ఆధిపత్య పోరు బీభత్సంగా నడుస్తోందనే టాక్ బలంగానే వినిపించింది. ఇక బాలీవుడ్‌లో అయితే ఒకరిని తొక్కేందుకు మరొకరు యత్నించారనే టాక్ కూడా బీభత్సంగానే నడిచింది. అలాంటిది.. రష్మిక (Rashmika Mandanna) తాజాగా చేసిన కామెంట్స్ షాక్ ఇచ్చాయి.

Rashmika Mandanna

సమంత (Samantha) అనారోగ్యం విషయంపై తాజాగా స్పందించిన రష్మిక (Rashmika Mandanna) ఆమెకు అమ్మనవుతానంటూ భారీ డైలాగ్సే కొట్టింది. సామ్‌ (Samantha)కు మయో సైటిస్ అని ఆమె సోషల్ మీడియాలో ప్రకటించే వరకూ తెలియదని.. తెలిశాక తాను చాలా బాధపడ్డానని వెల్లడించింది.అంతే కాకుండా సమంత ఒక అద్భుతమైన మహిళ అని.. దయ, అందంల కలబోత అంటూ ఆమెకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని తెలిపింది.

Rashmika Mandanna Vijay Deverakonda

మిగిలినవన్నీ ఓకే కానీ సమంతకు రష్మిక అమ్మనవుతా అనడమే నెటిజన్లకు కాస్త షాకింగ్‌గా మారింది. రష్మిక (Rashmika), రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరూ జంటగా పలుమార్లు పట్టుబడ్డారు కూడా. అయితే తాజాగా సమంతకు విజయ్ క్లోజ్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ చెక్ పెట్టేందుకు రష్మిక (Rashmika Mandanna) అమ్మ అవుతానంటూ స్టేట్‌మెంట్ పాస్ చేసిందనే కామెంట్ వినబడుతోంది.మొత్తానికి ఒకే ఒక్క కామెంట్‌తో సామ్, విజయ్‌ల మధ్య రిలేషన్‌షిప్ స్టేటస్‌ని మార్చేసిందని సోషల్ మీడియాలో గట్టిగా టాక్ వినిపిస్తోంది.

Google News