Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’కు విశాఖ పోలీసుల ఝలక్.. అంతలోనే…

Chiranjeevi in Waltair Veerayya

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సినిమా రిలీజ్ అవుతుందంటే ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. చాలా కాలం తర్వాత మాస్ మహారాజ్ రవితేజ.. (Raviteja) చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంది. దీనిలో భాగంగా జనవరి 8న వైజాగ్ సాగర తీరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. 

ప్రి రిలీజ్ వేడుక (Waltair Veerayya Pre Release Event) కార్యక్రమాల బిజీలో ఉన్న చిత్ర యూనిట్‌కి ఏపీ పోలీసులు ఝలక్ ఇచ్చారు. ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అనుమతులు లేవంటూ  చేస్తున్న పనులను అర్ధాంతరంగా నిలిపివేయించారు. అయితే ఆ తరువాత ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో నిర్వహించుకోవచ్చని పర్మిషన్ ఇవ్వడంతో అక్కడ వాల్తేరు వీర‌య్య (Waltair Veerayya) ప్రీ రిలీజ్ వేడుకకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి, రవితేజ తదితరులంతా హాజరు కానున్నారు. 

Waltair Veerayya Pre

‘అందరివాడు’ తర్వాత మెగాస్టార్ (Megastar) పక్కా మాస్ లుక్‌లో కనిపించనున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. చాలా కాలం తర్వాత చిరు మాస్ లుక్‌లో కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మ‌రో వైపు ర‌వితేజ .. మాసిజం కూడా యాడ్ కావ‌టంతో ఈ అంచ‌నాలు పీక్స్‌కి చేరుకున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు త‌గ్గ‌ట్టే వాల్తేరు వీర‌య్య ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.72.5 కోట్లుగా జ‌రిగింది.

Google News