Sindhooram: బాబోయ్ నా వల్ల కాదు.. సింధూరం దెబ్బకు ఐదేళ్లు అప్పులు!

Sinduram

ప్రసుత్తం రీరిలిజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్ హీరోల బర్త్‌డేలు వంటి అకేషన్స్‌ను బేస్ చేసుకుని వారు నటించిన చిత్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్‌ను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఖుషి, జల్సా, ఒక్కడు, మురారి వంటి సినిమాలు ప్రేక్షకులను మరోమారు అలరించాయి. మరికొన్ని చిత్రాలు రీరిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ కృష్ణవంశీకి ఓ నెటిజన్ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 

‘కృష్ణవంశీ (Director Krishna Vamsi) గారు ఒక్కసారి.. మీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం (Sindhooram) సినిమా రీరిలీజ్‌ చేయాలని కోరుకుంటున్నా’ అని సదరు నెటిజన్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశాడు. ఆ సినిమాను మరోసారి థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తే.. చూసేందుకు తనతో పాటు చాలా మంది సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. తన జీవితంలో తాను చూసిన గొప్ప సినిమా సింధూరమని.. తాను మృతి చెందేలోపు మరోసారి ఆ సినిమాను చూడాలనుకుంటున్నట్టు తెలిపాడు.

Krishna Vamsi

కానీ ఆ మాట విన్న కృష్ణవంశీ (Krishna Vamsi)కి షాక్ కొట్టినంత పనైంది. ఆయన ఇచ్చిన రిప్లై నెట్టింట వైరల్ అవుతోంది. “అమ్మో.. ఆ సినిమా కారణంగా.. 5 ఏళ్ళు అప్పులు కట్టాను అయ్యా.. వామ్మో’ అంటూ కృష్ణవంశీ దణ్ణం పెట్టేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘ఆంధ్రా టాకీస్’ అనే పతాకంపై తొలి ప్రయత్నంగా ‘సింధూరం’ (Sindhooram) చిత్రాన్ని కృష్ణవంశీ నిర్మించి, దర్శకత్వం వహించాడు.

Google News