Naresh Pavitra Marriage: నరేష్, పవిత్రల పెళ్లికి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఇచ్చిన మూడో భార్య రమ్య

Naresh Pavitra Marriage

సీనియర్ నటుడు నరేష్ (Naresh), సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) ప్రేమాయణం గత ఏడాది కాలంగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ జంట తమ పెళ్లి ప్రకటన చేస్తూ విడుదల చేసిన వీడియో తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి (Ramya Raghupati) మరోవైపు వీరిద్దరి రిలేషన్‌పై నానా యాగీ చేస్తోంది. 

Naresh Pavitra Marriage Tit

ఇప్పటికే నరేష్పై న్యాయ పోరాటం చేస్తున్న‌ రమ్య తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వీరిద్దరి బంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేష్, పవిత్రల పెళ్లిపై ఆమె మాట్లాడుతూ.. దానిని మళ్లీ పెళ్లి అనరని… మళ్ళీ మళ్ళీ మ‌ళ్లీ పెళ్లి అని పెట్టుకుంటే బాగుంటుందని సెటైర్లు వేశారు. కేసు కోర్టులో నడుస్తున్నందున తాను కామ్ అయ్యానని.. మీడియాలో హైలెట్ అవ్వాలన్న తాపత్రయం తనకు లేదన్నారు. 

Naresh Third Wife Ramya

ఎప్పుడూ మీడియాలో హైలైట్ అవ్వాలని నరేష్ – పవిత్ర (Naresh – Pavitra Lokesh)లే యత్నిస్తూ ఉంటారని రమ్య చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సమయంలో కూడా మీడియా హంగామా ఉన్నంత సేపు మాత్రమే వారిద్దరూ అక్కడ కనిపించారు. ఆ హంగామా తగ్గి.. అభిమానులు కృష్ణను కడసారి చూసేందుకు వచ్చినప్పటికే వారిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారని రమ్య ఆరోపించారు. నరేష్, పవిత్రల పెళ్లి ప్రకటన అనంతరమే రమ్య ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

Google News