సుహాస్ ‘ప్రసన్నవదనం’ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందట..

సుహాస్ ‘ప్రసన్నవదనం’ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందట..

చిన్ని సినిమాలు చేస్తూ పెద్ద పెద్ద హిట్స్ కొడుతున్నడు హీరో సుహాస్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌ వంటి బ్లాక్‌బ‌స్టర్ హిట్ త‌ర్వాత సుహాస్ న‌టించిన చిత్రం ప్రసన్నవ‌ద‌నం. ఇవాళ ప్రసన్నవదనం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం డిఫరెంట్ కాన్సెప్ట్‌ను సుహాస్ ఎంచుకున్నాడు. ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే దర్శకత్వం వహించారు. రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణలు హీరోయిన్స్‌గా నటించగా..  జేఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

సుహాస్ కళ్ల ముందు ఓ హత్య జరుగుతుంది. ఈ హత్యలో సుహాసే నిందితుడిగా చిక్కుకుంటాడు. దీనిలో నుంచి బయటపడటానికి తనకున్న జబ్బును అధిగమించి మరీ అసలు దోషిని పట్టుకోవడమే కాకుండా తను ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడనేదే ఈ కథ సారాంశం.  మంచి థ్రిల్లర్ సస్పెన్స్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంది? అనే దానిపై ట్విటర్ వేదికగా ప్రేక్షకులే సమాధానం ఇస్తున్నారు. అయితే ప్రేక్షకులు ఇచ్చిన రివ్యూస్ అన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయి. 

సినిమా ఆది నుంచి అంతం వరకూ సస్పెన్స్ కంటిన్యూ అయ్యిందంటున్నారు. ముఖ్యంగా సుహాస్‌, వైవా హ‌ర్ష యాక్టింగ్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. సినిమా చాలా వ‌ర‌కు చాలా థ్రిల్లింగ్‌గా ఉందంటున్నారు. ఫేస్ బ్లైండ్‌నెస్ అనే థీమ్ అదిరిపోయింద‌ని చెబుతున్నారు. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వొద్దని కొందరు ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక హీరోయిన్స్‌కు కూడా యాక్టింగ్ పరంగా మంచి మార్కులే పడుతున్నాయి. థ్రిల్లర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమాపై సక్సెస్ టాకే వినిపిస్తోంది.

Google News