‘మహారాజ’ రివ్యూ.. విజయ్ కెరీర్‌కే మైల్ స్టోన్..

‘మహారాజ’ రివ్యూ.. విజయ్ కెరీర్‌కే మైల్ స్టోన్..

కథ మాత్రమే ముఖ్యమని నమ్మే నటులు కొందరే ఉంటారు. అటువంటి నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. హీరో, విలన్ అంటూ గిరి గీసుకుని కూర్చోకుండా పాత్ర ఏదైనా కథలో బలం ఉందంటే ఓకే చెప్పేస్తాడు. విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహారాజ’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఎలా ఉందో చూద్దాం. సినిమా ప్రమోషన్స్ సమయంలోనే విజయ్ ఓ మాట చెప్పాడు. ఇది దర్శకుడిని కాదని కథని నమ్మి నటించిన చిత్రమని చెప్పాడు. మరి అంతగా కథలో ఏముంది? అంటే.. ఈ చిత్రంలో భార్య చనిపోవడంతో కూతురే ప్రపంచంగా బతుకుతుంటాడు విజయ్. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. కామ్‌గా తన పనేదో చూసుకుంటూ ఉంటాడు. 

ఓ రోజు విజయ్ ఇంట్లో దొంగలు పడి లక్ష్మిని దోచుకెళతారు? వెంటనే లక్ష్మిని వెదికి పెట్టాలని పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతాడు. లక్ష్మి ఎవరు? ఎవరు దొంగిలించారు? వాళ్లెలా దొరికారనేదే కథ. ఈ సినిమా కథ హార్ట్ టచింగ్ సన్నివేశంతో ప్రారంభమవుతుంది. హీరోకు బిల్డప్‌లు గట్రా ఏమీ ఉండవు. దర్శకుడు అద్భుతంగా సినిమాను రూపొందించాడనంలో సందేహమే లేదు. స్కూల్లో ప్రిన్సిపాల్‌తో త‌న కూతురికి సారీ చెప్పించే సన్నివేశంతో కనీసం ఫైటింగ్‌లు.. వార్నింగ్‌లు వంటివేమీ లేకుండా హీరో స్టామినా ఏంటో తెలిసేలా చేశాడు దర్శకుడు. తరువాత కథలో మనం పూర్తిగా లీనమైపోతాం.

‘మహారాజ’ రివ్యూ.. విజయ్ కెరీర్‌కే మైల్ స్టోన్..

ఇక పోలీస్ స్టేష‌న్ సీన్‌తో మన ఇంట్రస్ట్ మరింత పెరుగుతుంది. అస‌లు ఆ ల‌క్ష్మి ఎవ‌ర‌నేదే మొద‌టి ట్విస్టు. అక్కడి నుంచి సినిమా ఆసాంతం చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. ఎక్కడా థ్రిల్ మిస్ అవకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారు. ఎక్కడ రివీల్ చేయాలో అక్కడే రివీల్ చేశారు. తొలుత పోలీస్ వ్యవస్థపై అసహనం.. ఆ తరువాత అభిమానంగా మారడాన్ని చక్కగా చూపించారు. విజయ్ కెరీర్‌లోనే ఇదొక మైల్ స్టోన్ అని చెప్పాలి. హింస కాస్త ఎక్కువైనా కూడా కథకు అవసరమే అనిపించేలా ఉంటుంది. సినిమాలో పాటలు ఉండవు. నేపథ్య సంగీతం అద్భుతం. మొత్తానికి సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చి తీరుతుంది.

Google News