హేమకు ఇక గడ్డు రోజులేనా..?

హేమకు ఇక గడ్డు రోజులేనా..?

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ.. టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో నటీనటులు, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు ఈ పార్టీకి హాజరవ్వడంతో పరువు గంగలో కలిసినట్టయ్యింది.! దీనికి తోడు.. సీనియర్ నటి హేమ అడ్డంగా దొరికిపోయినా బుకాయించడానికి, జనాలను వెర్రివాళ్లను చేయడానికి అబ్బే ‘నేను పోలేదు.. ఇదిగో ఫామ్ హౌస్‌లో ఉన్నా.. పచ్చడి చేస్తున్నా’ అంటూ రోజుకో వీడియో రిలీజ్ చేయడం ఎంత సిగ్గుచేటో..! మొదటి వీడియోలో ఉన్న బ్యాగ్రౌండ్‌, హేమ ధరించిన బట్టలు ఒక్కటేనని.. పార్టీలో ఉందని పోలీసులు ఫొటోలు, సీపీ చెప్పినప్పటికీ రెచ్చగొట్టినట్లుగా.. పోలీసులనే హేళన చేస్తూ ఇలా వీడియోలు బుకాయిస్తూ వరుసబెట్టి వీడియోలు వదలడమేంటి..? దీన్ని నిజంగా పైత్యం అనుకోవాలా.. అత్యుత్సాహం.. అంతకుమించి ఏమనాలో తెలియట్లేదు!.

హేమకు ఇక గడ్డు రోజులేనా..?

హే… మ కష్టమే!

టాలీవుడ్ పరువు తీసిన హేమను ఇకపై ఎవరూ సినిమాల్లోకి తీసుకోకూడదని నిర్ణయించినట్లుగా సమాచారం. ఇప్పటికే ‘మా’ అసోసియేషన్ నుంచి నిర్మాతలు, డైరెక్టర్లకు క్లియర్ కట్‌గా ఆదేశాలు వెళ్లినట్లుగా తెలియవచ్చింది. అంటే ఇక సినిమా ఛాన్సులు హేమకు కష్టమేనన్న మాట. అయినా ప్రశాంతంగా ఇంటిపూట ఉండక.. కాసులకు కక్కుర్తిపడి బెంగళూరుకు బట్టలు చింపుకునేంత అవసరమేంటి..? అనేది ఆమెకే తెలియాల్సి ఉంది. ఇప్పుడు అసలుకే ఎసరు పడింది..? మరి ఇప్పుడు ఏం చేస్తారు..? పోనీ హేమ పక్షాన నిలబడటానికి ఎవరైనా ముందుకొస్తారా..? అసలు రావాల్సిన అవసరం ఎవరికుంది..? బర్త్ డే పార్టీ చేసుకున్న, రేవ్ పార్టీ నిందితుడు వాసు అనే వ్యక్తి కోట్లకు పడగలెత్తిన వ్యక్తి.. ఏదోలా బయటపడతాడు.. తమరిని పట్టించుకునేదెవరు..? అయినా హైదరాబాద్ వద్దనుకుని బెంగళూరులో పార్టీ అంటే.. కాసింత అయినా ఆలోచించనక్కర్లేదా..? అని సినీ ప్రియులు దుమ్మెత్తిపోస్తున్నారు.

హేమకు ఇక గడ్డు రోజులేనా..?

దీనికి హేమను బ్యాన్ చేస్తున్నారని టాక్ నడిచిన టైమ్‌లోనే ‘మా’ నుంచి ప్రకటన రావడం ఏదో తేడా కొడుతోందనే చెప్పుకోవచ్చు. అయినా.. పెద్ద పెద్ద డ్రగ్స్ కేసుల్లో అడ్డంగా దొరికిపోయినోళ్లు.. డ్రగ్స్ తీసుకుని.. కోట్లు ఎగ్గొట్టిన వాళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే.. చాలా రకాల తప్పులు చేసి ఉన్నారు. వారందరూ ఇప్పుడు ఎంచక్కా సినిమాలు చేసుకుంటున్నారు.. జస్ట్ పార్టీలో పాల్గొన్నంత మాత్రాన హేమను బ్యాన్ చేస్తారా..? అన్నది డౌటే..!

Karate Kalyani on Hema

రేవు పెట్టి ఉతికేయాల్సిందే..?

హేమ గురించి చిత్ర విచిత్రాలుగా వార్తలు వస్తున్న తరుణంలో నటి కరాటే కల్యాణి రంగంలోకి దిగింది. రేవ్ పార్టీలు పెట్టే వారిని, వాటిలో పాల్గొనే వారిని రేవు పెట్టి ఉతికేయాలని ఒకింత సంచలన వ్యాఖ్యలే చేసింది. హేమ ఆ పార్టీలో పాల్గొందని తేలితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తామని తేల్చి చెప్పేసింది. తప్పు చేసిన వారు ఆడవాళ్లయినా, మగవాళ్లయినా ఒకటేనని, వదిలిపెట్టేదిలేదని చెప్పడం చర్చకు దారితీసింది. తప్పు ఎవరు చేసినా కచ్చితంగా తప్పేనని, దానికి ఫలితం అనుభవించాల్సిందేనని చెప్పకనే చెప్పేసింది. ఇలాంటి పార్టీల వల్ల ఒక్కరు తప్పుచేసినా మొత్తం ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోందని.. హేమను ఎవరూ ఇరికించాల్సిన అవసరం లేదని, నోటి దురుసుతనమే ఆమెకు శత్రువని కల్యాణి చెప్పుకొచ్చింది. ‘హేమక్కా ఇలా అయిపోయావేంటి.. నిన్ను చూస్తే జాలేస్తోంది. ఈ కేసు నుంచి నువ్వు తొందరగా బయటపడాలని కోరుకుంటున్నా’ అని కల్యాణి సెటైర్లేసింది. కాగా.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీగా కరాటే కల్యాణి ఉన్న సంగతి తెలిసిందే.

Google News