ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి హాలీవుడ్ నటి ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి హాలీవుడ్ నటి ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఆర్ఆర్ఆర్’ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా జనాల నోళ్లలో నానుతూనే ఉంది. ఈ సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు రాకుంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ వచ్చాక మాత్రం మోత మోగుతోంది. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట ఇంకా దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ సినిమా గురించి మన దక్షిణాది జనాలే కాదు.. దేశమంతా.. ఆ మాటకొస్తే హాటీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను మర్చిపోలేకపోతున్నారు.

తాజాగా హాలీవుడ్ బ్యూటీ ఒకరు ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తలచుకోవడమే కాదు.. ఈ సినిమాకు సంబంధించి తన కోరికను ఒక దానిని బయటపెట్టి షాక్ ఇచ్చింది. హాలీవుడ్ నటి అన్నే హాథ్‌వే ఈ సినిమాను అందరి మాదిరిగానే ఎంతగానో ఇష్టపడిందట. ఈ సినిమా అద్భుతంగా ఉందని తెలిపింది. ఈ సినిమాలో నటించిన వాళ్లలో ఎవరితోనైనా కలిసి పనిచేయడమనేది నిజంగానే తన కల అని అన్నే హాథ్‌వే తెలిపింది.

anne hathaway

అన్నే హాథ్‌ వే.. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలైన ‘ఇంటర్ స్టెల్లార్’, ‘ద డార్క్ నైట్ రైజెస్’ సినిమాల్లో నటించింది. తాజాగా ఆమె ‘ద ఐడియా ఆఫ్ యూ’ అనే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది. అమ్మడి కామెంట్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించేనని నెటిజన్లు అంటున్నారు.