నేను.. మోదీ బయోపిక్‌లో నటించడమా.. నో ఛాన్స్!

నేను.. మోదీ బయోపిక్‌లో నటించడమా.. నో ఛాన్స్!

అవును.. ‘నేను ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటించట్లేదు.. నాపై వస్తున్న వార్తలన్నీ వాస్తవాలు కాదు’ అని సీనియర్ నటుడు సత్యరాజ్ క్లియర్ కట్‌గా చెప్పేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఇప్పుడు బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ ఇవే సూపర్ డూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి. మోదీ జీవితంపై బయోపిక్ వస్తోందని.. అందులో సత్యరాజ్ నటిస్తారని గత వారం రోజులుగా ఒక్కటే వార్తలు. దీంతో ఇందులో నిజమెంత..? అని ఓ ఇంటర్వ్యూ వేదికగా ప్రముఖ నటుడు క్లారిటీ ఇచ్చుకున్నారు.

నిజం లేదబ్బా!

నేను మోదీ బయోపిక్‌లో నటించట్లేదు. ఈ వార్తలు విని నాకే ఆశ్చర్యమేసింది. అసలు ఆ ప్రాజెక్ట్ కోసం కానీ.. ఫలానా పాత్రలో నటించాలని  ఎవరూ సంప్రదించలేదు. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ఇకపై ప్రచారం చేయకండి.. నిజానిజాలెంటో తెలుసుకుని వార్తలు రాయండి. మళ్లీ చెబుతున్నా.. భవిష్యత్‌లో నేను మోదీ బయోపిక్‌లో నటించను. నన్ను ఎవరైనా సంప్రదించినా సరే నేను నటించను. ఎందుకంటే.. ఇది నా సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది’ అని సత్యరాజ్ చెప్పేశారు. అంటే.. మోదీ అంటే బహుశా సత్యరాజ్‌కు ఇష్టం లేదనుకుంటా.. ఇక బీజేపీ సిద్ధాంతాలు కూడా అస్సలు పడవేమో మరి. అందుకే ఇంత నిక్కచ్చిగా చెప్పేస్తున్నాడు.

ఆగుతాయా..?

ఇంత క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా వార్తలు ఆగుతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఎక్కడ మళ్లీ పుకార్లు రేపుతారో అని.. ముందుగానే ఇప్పటికే చాలా రూమర్లు వచ్చాయని.. ఇకనైనా ఆపేయండి మహాప్రభో అని సత్యరాజ్ చెప్పకనే చెప్పారు. సో.. చూశారుగా ఇదీ మోదీ బయోపిక్‌, సత్యరాజ్ కథ. అయినా ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోవచ్చాయి.. ఇక సినిమా కథ రాయాల్సిన అవసరం ఎవరికుంది..? నిర్మాతగా కోట్లలో డబ్బులు పెట్టాల్సిన అవసరం అంతకన్నా ఎవరికుంది..? చూద్దాం.. మున్ముందు ఇంకా ఏం జరుగుతుందో..!