హైస్పీడులో దూసుకొచ్చిన ప్రభాస్ ‘బుజ్జి’.. ఎన్ని కోట్లో తెలుసా..?

హైస్పీడులో దూసుకొచ్చిన ప్రభాస్ 'బుజ్జి'.. ఎన్ని కోట్లో తెలుసా..?

స్టార్ హీరో ప్రభాస్ బుజ్జి హైస్పీడులో దూసుకొచ్చింది. మొన్న బుజ్జిని సగం మాత్రమే చూపించి ఎక్కడలేని ఆసక్తి రేపిన డార్లింగ్ ఇప్పుడు పూర్తిగా రివీల్ చేసేసాడు. ‘కల్కి 2898AD’ మూవీలో బుజ్జి వచ్చేసింది. బుధవారం రాత్రి మేకర్స్ యూట్యూబ్ వేదికగా రివీల్ చేశారు. బుజ్జి అంటే కల్కి సినిమాలో ప్రభాస్ వాడే వాహనం పేరు. ఇందులో ప్రభాస్ పాత్ర పేరు భైరవ. అంటే భైరవ వాహనం బుజ్జి అన్నమాట.

బుజ్జితో గ్రాండ్ ఎంట్రీ..!

రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈవెంట్లో బుజ్జిపై ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రేక్షకుల కోసం యమా స్పీడుగా దూసుకొని వచ్చేశాడు.ఇంకెందుకు ఆలస్యం బుజ్జిని మీరు కూడా చూసేయండి. ఇక ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్.. కొత్తదనం చూసి అభిమానులు ముచ్చట పడిపోతున్నారు. కాగా.. సినిమాలో యుద్ధ సన్నివేశాలకు ఈ వాహనం వాడారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ పరిచయం చేసిన బుజ్జి గురించే మాట్లాడుకుంటున్నారు.

హైస్పీడులో దూసుకొచ్చిన ప్రభాస్ 'బుజ్జి'.. ఎన్ని కోట్లో తెలుసా..?

బుజ్జి ఎన్ని కోట్లు..?

మామూలుగా సినిమాల్లో గ్రాఫిక్స్, మెషిన్లతో మ్యానేజ్ చేస్తారు.. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఐతే.. బుజ్జిని నాగ్ అశ్విన్ స్వయంగా తయారు చేయించి.. సినిమాకు విడుదలకు ముందే రివిల్ చేయడం గమనార్హం. ఏకంగా ఈ కారు తయారీ కోసం రూ.7 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఖర్చుకు తగ్గట్టుగానే బుజ్జిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత మాత్రం వావ్ అంటున్నారు. ఎందుకంటే.. ఆ కారు డిజైన్, ఆపరేషన్స్ అంత రేంజ్ లో ఉన్నాయి. ఇవన్నీ అటుంచితే బుజ్జితో వచ్చిన ప్రభాస్ ని చూస్తూ.. హీరో పెద్దమ్మ చిన్న పిల్లలా చప్పట్లు కొట్టడం చూసి అంతా ఫిదా అయిపోయారు. చూశారుగా.. ఇదీ బుజ్జి రేంజ్..!