‘కల్కీ’ ఈవెంట్‌లో ప్రభాస్ అలా.. నాగీ ఇలా..!

‘కల్కీ’ ఈవెంట్‌లో ప్రభాస్ అలా.. నాగీ ఇలా..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. టాలెంటెడ్ డైరెక్ట్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 ఏ.డి’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌‌పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో డార్లింగ్ సరసన దీపికా పదుకునే, దిశా పటానీలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. యూనివర్సల్ స్టార్, విలక్షణ నటుడు కమల్ హాసన్.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌లు కీలక పాత్రలో నటిస్తున్నారు. అంటే ఇంచుమించు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ అంతా కవర్ అయ్యిందన్న మాట. ఇక కల్కీ టీమ్.. బుజ్జి X భైరవ ఈవెంట్‌ను గ్రాండ్ నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా.. ప్రభాస్, నాగీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అవును.. ఇద్దరే ఇద్దరు!

కమల్ హాసన్, అమితాబ్‌తో నటించడంపై ప్రభాస్ సంతోషం వ్యక్తం చేశారు. నిజంగా.. ఇండియో మొత్తం ఇన్‌స్పయిర్ (స్పూర్తినిచ్చే) అయ్యింది ఈ ఇద్దరిని చూసే.. అదృష్టం కొద్దీ  తాను వీరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్నాడు. బిగ్ బీ లాంటి నటుడు ఇండియాలో ఉన్నందుకు చాలా గర్వంగా ఫీలవ్వాలన్నాడు. ఇక కమల్ హాసన్ గురించి చెప్పాల్సి వస్తే.. ‘సాగర సంగమం’ సినిమా చూసే అలాంటి బట్టేలు కావాలని అమ్మని అడిగేవాడినని చిన్ననాటి గురుతులు గుర్తు చేసుకున్నాడు ప్రభాస్. కమల్, అమితాబ్.. చిత్ర యూనిట్ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

బుజ్జి కోసం ఈవెంట్ ఎందుకంటే..?

సినిమాలో ప్రభాస్ వాడే వాహనం పేరు బుజ్జి. ఈ కారును ఎన్ని సస్పెన్స్‌ల మధ్య రిలీజ్ చేశారో అందిరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటిది వెహికల్ కోసం ఈవెంట్ పెట్టడమేంటి..? అని అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి. పైగా అమితాబ్ లాంటివారికోసం చిన్నపాటి గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేసి.. బుజ్జి కోసం ఈవెంట్ చేయడంపై ఒకింత విమర్శలే వచ్చాయి. అందుకే ఈ ఈవెంట్ వేదికగా తొలుత దీనిపైనే స్పందించాడు నాగ్ అశ్విన్. బుజ్జి.. ఈ పేరు చిన్నదిగా ఉంది కానీ.. మామూలుగా ఉండదని నాగీ చెప్పాడు. అంతేకాదు.. బుజ్జి సినిమాకు చాలా స్పెషల్ అన్నాడు. ఈ వెహికిల్‌ను ప్రిపేర్ చేయడానికి చాలా కష్టపడినట్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కాగా.. జూన్- 27న ప్రపంచ వ్యాప్తంగా.. రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలే ఉన్నాయ్. ఇక సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని డార్లింగ్ అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో వేచి చూస్తున్నారు.